సెట్స్ మీదికి వెళ్లిన ప్రతి సినిమా పూర్తవుతుందని.. పూర్తయినా విడులవుతుందని చెప్పలేం. ఇలా మధ్యలోనే ఆగిపోయే, విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు కోకొల్లలుగా ఉంటాయి. కొన్నిసార్లు పేరున్న హీరోలు నటించిన సినిమాలు సైతం రకరకాల కారణాలతో మరుగున పడిపోతుంటాయి. రానా దగ్గుబాటి కెరీర్లోనూ అలాంటి సినిమా ఒకటుంది.
అదే.. 1945. ‘బాహుబలి’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న టైంలో రానా మొదలుపెట్టిన సినిమాల్లో ఇదొకటి. సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాన్ నిర్మాణంలో సత్య శివ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రం మొదలైంది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా వార్తల్లో నిలిచింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. మరుగున పడిపోయింది. సినిమా పూర్తయిందో లేదో కూడా అప్‌డేట్ లేదు. రిలీజ్ గురించి ఊసే లేదు. ఈ సినిమాను జనాలందరూ పూర్తిగా మరిచిపోయిన టైంలో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
తాజాగా మీడియాను కలిసిన నిర్మాత సి.కళ్యాణ్.. ‘1945’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా అన్న ఒక్క రోజులోనే రిలీజ్ డేట్ పోస్టర్లు బయటికి వచ్చేశాయి. ‘1945’ చిత్రాన్ని డిసెంబరు 31న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్, లేటెస్ట్ పోస్టర్ చూస్తే ఇది స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. రానా చేతిలో బ్రిటిష్ జెండాకు నిప్పంటించి పట్టుకున్నాడు ఈ పోస్టర్లో.
ఐతే ఇన్నేళ్లుగా వార్తల్లో లేని, జనాలు పూర్తిగా మరిచిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది డౌటు. తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి ఆకుల శివ మాటలు సమకూర్చాడు. రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ సైతం చాన్నాళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ చిత్రం ఓటీటీ బాట పడుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 10, 2021 9:22 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…
వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ ఖాతాలో వేసిన డాకు మహారాజ్ ఎనిమిది రోజులకు 156 కోట్లకు పైగా గ్రాస్…
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…