Movie News

ఏదైనా బాలయ్యకే చెల్లు

2019లో మూడు సినిమాలతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్: కథానాయకుడు కాగా.. ఇంకోటి యన్.టి.ఆర్: మహానాయకుడు. మూడోదేమో రూలర్. ‘యన్.టి.ఆర్’ ఫెయిలవడానికి సినిమా కోణంతో పాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పటికి జనాల్లో ఉన్న వ్యతిరేకత, ఈ బయోపిక్‌ను తమకు అనుకూలంగా కన్వీనియెంట్‌గా తీయడం.. రకరకాల కారణాలు తోడై ఆ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బాలయ్య స్టార్ పవర్ ఎంత మాత్రమూ ఆ సినిమాలకు ఉపయోగపడలేదు. వాటిని పక్కన పెట్టేస్తే ‘రూలర్’ సినిమా అయినా నందమూరి అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తుందేమో అనుకుంటే అది కూడా పెద్ద డిజాస్టరే అయింది.

కేవలం 12.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందా చిత్రానికి.ఐతే ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగానే అందుకునేలా ఉందీ చిత్రం. ఐతే ‘రూలర్’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘అఖండ’కు కూడా అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఐతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరీ ఏడున్నర కోట్ల షేర్ రావడం బాలయ్యకు ఒక రకంగా పరాభవంగానే చెప్పాలి.

ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.60 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్లడం కూడా బాలయ్యకే చెల్లింది. వరుసగా రిలీజైన రెండు చిత్రాలతో ఇంత వైరుధ్యం అనూహ్యమైన విషయం. వేరే స్టార్లతో పోలిస్తే బాలయ్యను భిన్నంగా నిలిపేది ఇదే. వేరే హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్, ఓ మోస్తరు వసూళ్లు ఉంటాయి. కానీ బాలయ్య చిత్రానికి తేడా వస్తే వాషౌటే. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొస్తే బాలయ్య ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాడో చెప్పడానికి ‘అఖండ’ సాక్ష్యంగా నిలుస్తోంది.

This post was last modified on December 10, 2021 11:12 am

Share
Show comments

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

9 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

11 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

12 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

13 hours ago