థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన ఉద్దేశం.. సినిమా కథేంటో చూచాయిగా చెప్పడం. సినిమాలోని హైలైట్లను చూపించడంతో పాటు కథ మీద ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేస్తుంటారు ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా. కొందరు ఈ సూత్రాన్ని పాటించరు కానీ.. రాజమౌళి మాత్రం దాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. జక్కన్న ఏ సినిమా చూసినా.. ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమైపోతుంది. కథను దాచి పెట్టి ప్రేక్షకులను భ్రమల్లో ఉంచాలని రాజమౌళి అనుకోడు. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే సినిమా ఆరంభ దశలోనే కథ గురించి కొంచెం హింట్ ఇచ్చాడు.
కానీ తర్వాత వచ్చిన ప్రోమోలు కొంత గందరగోళానికి గురి చేశాయి. ఐతే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో జక్కన్న కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మొదట్నుంచి ఆరంభం వరకు కథ ఇలా ఉండొచ్చు అనే అంచనాకు వచ్చేలా ట్రైలర్ సాగింది. దీని ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కథ ఎలా ఉండొచ్చంటే..ముందుగా భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని చూపించడంతో కథ మొదలవుతుంది.
ఒక గోండు అమ్మాయిని బ్రిటిష్ అధికారి బలవంతంగా తనతో పాటు తీసుకుపోవడంతో ఆ వర్గానికి రక్షకుడిగా ఉన్న భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. తమను దెబ్బ కొట్టిన భీమ్‌ను పట్టుకోవడం చేత కాక పోలీస్ అయిన రామరాజును రంగంలోకి దింపుతారు. అతను తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్‌తో స్నేహం చేస్తాడు.
అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. ఐతే అప్పటి వరకు దేశ భక్తి భావం లేని అతను.. తర్వాత భీమ్ గురించిన వాస్తవాలు తెలుసుకుని, దేశం కోసం పోరాడే స్ఫూర్తిని పొందుతాడు. ఈ విషయంలో అజయ్ దేవగణ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత భీమ్‌తో కలిసి రామరాజు బ్రిటిష్ వారి మీద పోరాటానికి సిద్ధమవుతాడు. వీళ్లిద్దరూ బ్రిటిష్ వారిని గట్టి దెబ్బ తీసి.. అమరులవడంతో కథ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ కథపై కలిగిన అంచనా ఇది. ఇంతకుముందు సినిమాలో జక్కన్న ఏం చూపిస్తాడో చూడాలి మరి.
This post was last modified on December 9, 2021 9:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…