Movie News

రాధేశ్యామ్‌తో స‌మ‌స్య అదే

బాహుబ‌లి కోసం ఐదేళ్లు వెచ్చించాడు ప్ర‌భాస్. ఆ త‌ర్వాతి చిత్రం సాహో కూడా బాగానే ఆల‌స్య‌మైంది. దీని త‌ర్వాత ప్ర‌భాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ కోసం సుదీర్ఘ కాలం నుంచే నిరీక్షిస్తున్నారు అభిమానులు. క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం ఆల‌స్య‌మై.. చివ‌రికి 2022 సంక్రాంతి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

మేకింగ్ టైంలో స‌రైన అప్‌డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసింది. సినిమాకు ఆశించినంత బ‌జ్ కూడా రాలేదు. ఐతే రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర బృందంలో క‌ద‌లిక వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తున్నారు.

ఈ పాట‌లు సినిమా ప‌ట్ల పాజిటివిటీని పెంచుతున్నాయి. ఇటు సౌత్ వెర్ష‌న్ల పాట‌లు.. అటు హిందీ వెర్ష‌న్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇది రాధేశ్యామ్ టీంలో ఉత్సాహం పెంచుతోంది. ఈ ప్రేమ‌క‌థ విష‌యంలో ప్రేక్ష‌కుల్లో స‌రైన మూడ్ క్రియేట్ చేయ‌డంలో పాట‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఐతే రాధేశ్యామ్ విష‌యంలో సౌత్ ఫ్యాన్స్‌లో ఒక ర‌క‌మైన నెగెటివ్ ఫీలింగ్ ఉంది. ఇది ప‌క్కా బాలీవుడ్ మూవీ లాగా క‌నిపిస్తోంది. అచ్చంగా ఆషికి-2 త‌ర‌హా ఉన్నాయి ప్రోమోల‌న్నీ. దీని వ‌ల్ల ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్లో ఇది మ‌న సినిమా కాదు అనే ఫీలింగ్ వ‌స్తోంది. బేసిగ్గా రాధేశ్యామ్ తెలుగు చిత్రం అయినా.. మ‌న వాళ్ల‌కు ఇది మ‌న సినిమా అనిపించ‌ట్లేదు.

మ‌న నేటివిటీ ఎక్క‌డా లేదు. అలాగ‌ని హిందీ ప్రేక్ష‌కులు కూడా పూర్తిగా ఈ చిత్రాన్ని ఓన్ చేసుకుంటారా అనే విష‌యంలోనూ సందేహాలున్నాయి. అక్క‌డ క్లాస్ ల‌వ్ స్టోరీల‌ను ఇష్ట‌ప‌డే మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ అయితే ప్రోమోల‌తో బాగా క‌నెక్ట్ అవుతున్నారు. కానీ ప్ర‌భాస్‌కు నార్త్‌లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న‌ది మాస్‌లోనే. సాహో సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. యూపీ, బీహార్ లాంటి మాస్ ఏరియాల్లో భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఎ సెంట‌ర్ల‌లో ఆ సినిమాను పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. మాస్ చూడ‌బట్టే ఆ చిత్రానికి రూ.150 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చి బాక్సాఫీస్ స‌క్సెస్ అనిపించుకుంది. మ‌రి రాధేశ్యామ్ లాంటి క్లాస్ ల‌వ్ స్టోరీ విష‌యంలో హిందీ ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on December 9, 2021 7:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

16 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago