కొన్ని సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకాలం అమావాస్యకో పౌర్ణమికో ఓ అప్‌డేట్ వదులుతూ వచ్చిన మేకర్స్.. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో వరుస అప్‌డేట్స్తో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటిగా పాటలు వదులుతున్నారు. ఇవాళ హిందీ వెర్షన్ నుంచి ‘సోచ్‌లియా’ అనే పాట బైటికొచ్చింది.
ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ప్రేమ కనిపిస్తే.. ఇవాళ విడుదలైన పాటలో ఒకరికొకరు దూరమైన బాధ కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి గడిపిన అనుభూతులు.. కలవలేక కుమిలిపోతున్న క్షణాలు.. మాటరాని మౌనాలు.. కళ్లనుండి జారే కన్నీళ్లు.. మొదట్నుంచి చివరి వరకు ఎమోషనల్‌గా సాగిందీ పాట. మిథున్ ట్యూన్ మనసుల్ని తాకేలా ఉంటే.. అర్జీత్ సింగ్ గానం భావోద్వేగాల్ని తట్టి లేపుతోంది.
కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘నగుమోము తారలే’ అనే పాట విడుదలయ్యింది. అదే రోజు తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీ వెర్షన్ కూడా వచ్చింది. తెలుగు పాటతో పోలిస్తే హిందీ పాట చాలా బాగుందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈసారి ఈ పాట హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైంది. ఈ సిట్యుయేషన్ కోసం సౌత్ లాంగ్వేజెస్‌లో చేసిన పాట రాలేదు. దాంతో తెలుగు సాంగ్ ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఒకటి మాత్రం నిజం. తెలుగుతో పోలిస్తే హిందీ వెర్షన్ మ్యూజిక్ విషయంలో ఏదో మ్యాజిక్ జరుగుతోందనిపిస్తోంది..
సౌత్ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ చేసిన ట్యూన్స్ కంటే హిందీ వెర్షన్‌కి మిథూన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయి. లిరిక్స్ పరంగా కూడా హిందీనే బెటరనిపిస్తోంది. ఇప్పటి వరకు రాధేశ్యామ్ నుంచి వచ్చిన పాటల లిరిక్స్ ఏవీ సరిగ్గా అర్థం కావడం లేదనే కంప్లయింట్ తెలుగు ఆడియెన్స్ నుంచి వచ్చింది. కానీ హిందీలో మాత్రం సింపుల్ లిరిక్స్‌తో, అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి పాటలు. అక్కడే సాంగ్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి కూడా. ఓవరాల్‌గా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు కానీ.. మ్యూజిక్ పరంగా మాత్రం బాలీవుడ్‌లోనే రాధేశ్యామ్‌కి ఎక్కువ మార్కులు పడుతున్నాయేమో అనిపిస్తోంది.
This post was last modified on December 8, 2021 10:51 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…