సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ఆయన కొత్త సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో సినిమా అన్నారు కానీ.. దాని గురించి ఏ అప్ డేట్ లేదు. కొందరేమో త్వరలోనే సినిమా మొదలవుతుందని అంటున్నారు. కొందరేమో ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉందంటారు. కానీ ఏ విషయం స్పష్టత లేదు.
నిజానికి ఆయన ‘కల్కి’ తర్వాత కన్నడ హిట్ ‘కవులుదారి’ రీమేక్‌లో నటించాల్సింది. కానీ సినిమా అనౌన్స్ చేశాక దాన్నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా చిత్రాన్ని సుమంత్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.
తర్వాత రాజశేఖర్ సినిమాపై ఏ సమాచారం లేదు. ఐతే ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ భాగస్వామ్యంలో రాజశేఖర్ భార్య జీవిత నిర్మిస్తారట.
‘పలాస 1978’ సినిమాతో సత్తా చాటుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ‘పలాస’ను మెచ్చిన అరవింద్.. కరుణ్‌తో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి రాజశేఖర్ వచ్చాడు. తన వంతుగా పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు.
హార్డ్ హిట్టింగ్ కథాంశంతో తొలి సినిమాలో తన విలక్షణతను చాటిన కరుణ్.. ఈసారి రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోను పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. చిరంజీవితో ఫ్యామిలీతో వివిధ సందర్భాల్లో విభేదాల దృష్ట్యా రాజశేఖర్ ఆయన బావ అరవింద్ బేనర్లో సినిమా చేయడం విశేషమే.
చివరగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వివాదంలో రాజశేఖర్ తీరు పట్ల చిరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అప్పట్నుంచి ‘మా’ కార్యకలాపాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహరాలకు రాజశేఖర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 8, 2020 11:14 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…