తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్నో ఏళ్ల నుంచి అపూర్వమైన ఆదరణతో సాగిపోతోందీ షో. ఇందులో కామెడీ గురించి ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి కానీ.. మెజారిటీ ప్రేక్షకులు ఈ షోకు బాగా కనెక్ట్ అయిపోయారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు ప్రసారం అయ్యే ఈ షోలో సుడిగాలి సుధీర్ టీంకు ఉన్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు ప్రధాన ఆకర్షణ ఈ టీమే. ఈ టీంలో లీడర్ సుధీర్‌తో పాటు రాంప్రసాద్, గెటప్ శీను, సన్నీ కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఐతే సుధీర్, అతడి టీం జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోనున్నట్లు కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షోలోనే ఈ విషయాన్ని సుధీర్ టీం స్వయంగా వెల్లడించింది.
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఈ వారం సుధీర్ టీం చేసిన స్కిట్ దృశ్యాలను చూపించి.. చివరగా వాళ్లు ఈ షో నుంచి వెళ్లిపోతున్న విషయాన్ని వెల్లడించారు. తాము జబర్దస్త్‌ను వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను విన్నవించారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాలని అనుకున్నామని.. కానీ జబర్దస్త్ షోలోనే ఈ విషయం చెబుతున్నామని ఆ ముగ్గురూ అన్నారు.
ఈ సందర్భంగా ముగ్గురూ ఎమోషనల్ అయ్యారు. బ్రేక్ డౌన్ అయ్యారు. అలాగే జడ్జీలైన రోజా, మనో.. యాంకర్ రష్మి సైతం ఉద్వేగానికి గురయ్యారు. ఐతే జబర్దస్త్ షోలో గత అనుభవాల దృష్ట్యా.. సుధీర్ టీం నిజంగానే షోను వదిలి వెళ్లిపోతుందా.. లేక బయట జరుగుతున్న ప్రచారానికి కౌంటర్‌గా ఇలా చేసి కామెడీ చేశారా.. ప్రోమో ఇలా కట్ చేసి, చివరికి అసలు షోలో అందరినీ ఫూల్స్‌ను చేస్తారా అన్నదే అనుమానంగా ఉంది.
This post was last modified on December 8, 2021 10:49 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…