నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. అతడి కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. బెంగాలీ అయిన శ్యామ్ సింగ రాయ్ అనే బరువైన పాత్రను నాని చేస్తున్నాడిందులో. నాని చివరి రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ ప్రేక్షకులకు నిరాశను మిగిల్చాయి. ఆ సినిమాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక మైనస్ అయితే, అవి రెండూ ఓటీటీలో రిలీజ్ కావడం మరో మైనస్. దీంతో ఇప్పుడు నాని కొత్త చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించడం చాలా అవసరం.
ఐతే నాని సరైన ఫాంలో లేని టైంలో, బాక్సాఫీస్ దగ్గర అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజవుతోంది. సినిమా బడ్జెట్ ఎక్కువ. నాని మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టారు. అందుకు తగ్గట్లే ఎక్కువ రేట్లకు సినిమాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి బజ్ తీసుకురావడం, ఓపెనింగ్స్ బాగుండేలా చూడటం.. అలాగే ఓవరాల్ కలెక్షన్లు బాగుండి సినిమా హిట్టయ్యేలా చూడటం చాలా అవసరం.
ఐతే బిజినెస్ పరంగా నాని మీద పెద్ద బరువుండగా.. ప్రమోషన్ల పరంగా అతను ఒంటి చేత్తో భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యన్ బాగా లో ప్రొఫైల్. ‘ట్యాక్సీవాలా’తో హిట్ ఇచ్చినప్పటికీ వేరే డైరెక్టర్ల లాగా అతడికి హైప్ లేదు. దర్శకుడి నుంచి ప్రమోషన్ నిల్ అనే చెప్పాలి. ఇక సినిమా పేరున్న నిర్మాణ సంస్థలో తెరకెక్కి ఉంటే అటు నుంచి ప్రమోషన్ల హడావుడి ఉండేది.
ఇండస్ట్రీ నుంచి బ్యాకప్ కూడా లభించేది. నిజానికి ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాల్సింది. కానీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త సంస్థ ప్రొడ్యూస్ చేసింది. దీంతో ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రమోషన్ వీక్‌గానే ఉంది. హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టిల నుంచి కూడా ఏ హడావుడి కనిపించడం లేదు. దీంతో మొత్తం ప్రమోషన్ భారమంతా నానీనే చూసుకుంటున్నాడు. సినిమాకు ఏమాత్రం హైప్ వచ్చినా అది నానీ వల్లే. ఇక సినిమాలో కూడా నాని వన్ మ్యాన్ షో అన్నట్లే కనిపిస్తోంది. మరి ఇంత భారాన్ని మోస్తూ ‘శ్యామ్ సింగ రాయ్’కి నాని ఎలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.
This post was last modified on December 6, 2021 2:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…