Movie News

ధనుష్ సినిమాకి సల్మాన్ టైటిల్

టైటిల్‌ కోసం పెద్ద పెద్ద వివాదాలే చెలరేగిన సందర్భాలున్నాయి. దాన్ని మొదట మేం రిజిస్టర్ చేశామంటే మేం చేశామంటూ ఫిల్మ్ మేకర్స్ చాలామంది చాలాసార్లు గొడవపడ్డారు. ఇండస్ట్రీ పెద్దలు, కోర్టులు కల్పించుకోవాల్సిన పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఇప్పుడు ధనుష్ నటించిన హిందీ సినిమా టైటిల్ విషయంలోనూ సమస్య వచ్చింది. కానీ అది ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా సమసిపోయింది. 

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘అత్‌రంగీరే’ అనే సినిమా చేశాడు ధనుష్. సారా అలీఖాన్ హీరోయిన్. అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు. రీసెంట్‌గా ట్రైలర్‌‌ రిలీజై మెప్పించింది. ఈ నెల 24న మూవీ విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చాడు దర్శకుడు ఆనంద్. అందులో ఓ ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు.       ‘అత్‌రంగీరే’తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా ‘రక్షాబంధన్’ కూడా తీస్తున్నాడు ఆనంద్.

ఈ రెండు సినిమాల టైటిల్స్‌నీ రిజిస్టర్ చేయడానికి వెళ్లినప్పుడు ఓ సమస్య వచ్చిందట. ‘రక్షాబంధన్‌’ని రిజిస్టర్ చేశారు కానీ ‘అత్‌రంగీరే’ని చేయడానికి కుదరదు అన్నారట. అది సల్మాన్‌ ఖాన్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించాడని, అతనికే దానిపై రైట్స్ ఉన్నాయని అడ్డుకున్నారట. వెంటనే వాళ్లు సల్మాన్‌కి ఫోన్ చేసి విషయం చెబితే.. ఆ టైటిల్‌ తనదని, ఎవరికీ దానిపై రైట్ లేదని సల్లూ అన్నాడట. 

కాకపోతే ఆనంద్ ఎల్‌ రాయ్ అడిగితే మాత్రం ఇవ్వండి, తనకి తప్ప ఎవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని చెప్పాడట. దాంతో వాళ్లు ఆ టైటిల్‌ని ఆనంద్‌కి ఇచ్చారట. ‘నాకు మాత్రమే ఇవ్వమని సల్మాన్ ఎందుకు అన్నారో తెలీదు, ఆయనకి నామీద అంత అభిమానం ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నో అంటే నేను టైటిల్ మార్చుకోవాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చాడు ఆనంద్. ఏదైతేనేం.. ఏ గొడవా జరక్కుండా ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. సల్మాన్ టైటిల్‌ ధనుష్‌ సినిమాకి దక్కింది. 

This post was last modified on December 5, 2021 1:57 pm

Share

Recent Posts

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

7 minutes ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

10 minutes ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

36 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

36 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago