బాలీవుడ్ వాళ్లకు కొన్నేళ్ల నుంచి సౌత్ సినిమాల రీమేక్‌ల పట్ల ఉన్న మోజు ఎలాంటిదో సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది. దక్షిణాదిన ఏ భాషలో సినిమా హిట్టయినా దాని మీద వాళ్లు కర్చీఫ్ వేసేస్తున్నారు. ప్రధానంగా వాళ్ల కళ్లు తెలుగు, తమిళ చిత్రాల మీదే ఉంటాయి. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో తెలుగు చిత్రాలు రీమేక్ కావడం విశేషం.
కొత్త సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా, వసూళ్లు రాబడుతున్నా బాలీవుడ్ నిర్మాతలు ఆలస్యం చేయట్లేదు. సాధ్యమైనంత త్వరగా రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఖండ మీద కూడా వారి చూపు పడ్డట్లు సమాచారం. అఖండ కథ పరంగా చూసుకుంటే అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఇలాంటి మసాలా సినిమాలనే సాజిద్ నడియాడ్ వాలా లాంటి నిర్మాతలు టేకప్ చేసి, బాలీవుడ్ టచ్ ఇచ్చి వసూళ్ల పంట పండించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సాజిద్ సహా కొందరు నిర్మాతల దృష్టి అఖండ మీద పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వాళ్లు అఖండ విషయంలో బాగా కనెక్టయ్యే విషయం ఇంకోటుంది. ఇందులో దేవాలయాల పరిరక్షణ గురించి, హిందుత్వం గురించి చాలా బలంగా చెప్పారు. ఇదే ఇప్పుడు నార్త్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో చాలా చోట్ల దీని గురించి చర్చ జరుగుతోంది.
ఎప్పుడూ హిందుత్వాన్ని కించ పరుస్తూ.. వేరే మతాలకు మద్దతుగా సినిమాలు తీసే బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అఖండ లాంటి సినిమాలను చూసి నేర్చుకోవాలని కౌంటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ మూవీలో అఖండ పాత్రను తీసుకుని.. మిగతా కథలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తే మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి అవకాశముంటుందని.. అజయ్ దేవగణ్ లాంటి హీరో అయితే దీనికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని.. అక్షయ్ కుమార్ అయినా ఓకే అని భావిస్తున్నారట. ఈ సినిమాను రీమేక్ చేస్తే బ్యాకప్ ఇవ్వడానికి బీజేపీ నేతలు కొందరు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తుండటం విశేషం.
This post was last modified on December 5, 2021 12:35 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…