ఈ ఏడాది ఇండియాలో నెటిజన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సమంత టాప్ లో ఉండడం విశేషం. ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంటుంది యాహూ సంస్థ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు సెర్చ్ అయిన వాళ్లలో అల్లు అర్జున్ పేరు మూడో స్థానంలో ఉంది. మేల్ సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నటుడు సిద్ధార్థ్ శుక్లా పేరు ఉంది. చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో మరణించారు సిద్ధార్థ్ శుక్లా. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది అతడి పేరుని సెర్చ్ చేశారు.
రెండో స్థానం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్కింది. ఇక సల్మాన్ ఖాన్ తరువాత మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ తరువాతి స్థానంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికొస్తే.. మొదటిస్థానంలో కరీనా కపూర్, రెండో స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, ఆ తరువాత స్థానాల్లో అలియా భట్, దీపికా పదుకోన్ నిలిచారు. ఈ లిస్ట్ లో సమంత పదో స్థానంలో నిలిచింది. విడాకుల వార్తలతో సమంత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్ బార్ లో టైప్ చేశారు.
This post was last modified on December 4, 2021 4:10 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…