పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, సింగర్ గా ఎన్నో సినిమాలు చేశారు. గత కొన్నేళ్లలో మాత్రం ఆయన నటనకు మాత్రమే పరిమితమయ్యారు. అయినప్పటికీ మన మ్యూజిక్ డైరెక్టర్లు పవన్ తో పాటలు పాడించడం మాత్రం మానలేదు. ‘తమ్ముడు’తో మొదలుపెడితే.. ‘అజ్ఞాతవాసి’ వరకు దాదాపు ఆయన నటించిన ఏడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడారు.
‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’, ‘కొడకా కోటేశ్వరావు’ వంటి పాటలు పవన్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి పవన్ సింగర్ గా మారబోతున్నాడు. అది కూడా తన ‘భీమ్లానాయక్’ సినిమా కోసం కావడం విశేషం. మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి ఇది రీమేక్. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి కొన్ని పాటలు బయటకొచ్చాయి. ఇప్పుడు తమన్ మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో పవన్ తో ఓ పాట పాడించబోతున్నారు తమన్. ఈ విషయం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్ కు ముందే ఈ పాటను విడుదల చేస్తారట. ఈ సాంగ్ కచ్చితంగా మరో చార్ట్ బస్టర్ అవుతుందని అంటున్నారు. సినిమాలో కీలకమైన ఘట్టంలో ఈ సాంగ్ వస్తుందట. ఇక ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇందులో రానా కూడా నటిస్తున్నారు.
This post was last modified on December 4, 2021 4:06 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…