టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వినిపిస్తోంది. సమాజంలో చాలా మంది ప్రముఖులను మోసం చేయడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులను టార్గెట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వంద నుంచి రెండొందల కోట్ల వరకు జనాల నుంచి డబ్బు తీసుకొని మోసం చేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తానని.. స్థలాలు అమ్ముతానని ఇలా రకరకాల కారణాలతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి కూడా ఉంది. ఆమె దగ్గర నుంచి రూ.2.9 కోట్లు లాగేసింది శిల్పా.
ఇప్పుడు ఈమె బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడని తేలింది. ఆయన ఎవరంటే.. హర్ష్ కనుమిల్లి. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. స్థలంగా పేరు చెప్పి కొంత డబ్బు, అప్పుగా ఇంకొంత ఇలా దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది.
ఇప్పుడు ఆ మూడు కోట్లు పోయినట్లే. శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన అగ్రహీరో కూడా ఉన్నాడని టాక్. ఆయన, శిల్పా కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే ఈ ఇష్యూని సెటిల్ చేసుకొని.. డబ్బు వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శిల్పా వ్యవహారం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి.
This post was last modified on December 3, 2021 11:56 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…