Movie News

ఆర్ఆర్ఆర్ టీం త‌ప్పు చేసిందా?

ఆర్ఆర్ఆర్ టీం అన్నీ చూసుకునే జ‌న‌వ‌రి 7వ తేదీని రిలీజ్ డేట్‌గా ఎంచుకుంది. ఇంకోసారి డేట్ మారిస్తే ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చే స్పంద‌న ఎలా ఉంటుందో తెలిసిందే కాబ‌ట్టి.. కొన్ని ఇబ్బందులున్న‌ప్ప‌టికీ ఆ డేట్‌కే సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటోంది. ప్ర‌మోష‌న్లు కూడా జోరుగా చేస్తోంది కానీ ఈ సినిమాకు ఇది స‌రైన రిలీజ్ డేట్ కాదు అనే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఓవైపు తెలుగులో ఎంత పెద్ద స్థాయిలో సినిమాను రిలీజ్ చేసినా.. ఐదో రోజుల త‌ర్వాత భీమ్లా నాయ‌క్ కోసం.. ఏడు రోజుల త‌ర్వాత‌ రాధేశ్యామ్ సినిమాల కోసం థియేట‌ర్లు చాలా వ‌ర‌కు వ‌దులుకోవాల్సి ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అంటే కొన్ని వారాల పాటు ఎక్కువ‌ థియేట‌ర్ల‌లో ఆడాలి. అప్పుడే పెట్టుబ‌డి రిక‌వ‌రీ అవుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు వ‌స్తాయి. కానీ తెలుగులోనే ఈ చిత్రానికి అడ్డంకులు త‌ప్ప‌ట్లేదు. బాహుబ‌లిలా కొన్ని వారాల పాటు మెజారిటీ థియేట‌ర్ల‌లో ఆడే అవ‌కాశాన్ని ఆర్ఆర్ఆర్ కోల్పోతోంది. సినిమా ఎంత బాగున్నా స‌రే.. థియేట‌ర్లు కోల్పోక త‌ప్ప‌దు. రాధేశ్యామ్ నుంచి తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల కూడా ఆర్ఆర్ఆర్‌కు పోటీ త‌ప్ప‌దు. ఇక త‌మిళంలో ఆర్ఆర్ఆర్‌కు పెద్ద అడ్డంకి త‌ప్పేలా లేదు. అజిత్ సినిమా వ‌లిమై సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది.

అక్క‌డ అజిత్ క్రేజ్ గురించి, ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆర్ఆర్ఆర్‌కు బాహుబ‌లిలా అక్క‌డ గ్రాండ్ వెల్కం ఉండ‌క‌పోవ‌చ్చు. వ‌లిమైకే పెద్ద పీట వేయ‌క త‌ప్ప‌దు. దీనికి తోడు ప్ర‌భాస్ సినిమా రాధేశ్యామ్‌తోనూ త‌మిళంలో పోటీ ఉంటుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్‌కు ఇది ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. దీని బ‌దులు వేస‌వి లాంటి సీజ‌న్ చూసుకుని ఉంటే రెండు మూడు వారాల పాటు ఈ సినిమాకు ఏ డిస్ట‌బెన్స్ ఉండేది కాద‌ని.. దానిక‌ది రైట్ టైం అయ్యుండేడ‌ద‌న్న‌అభిప్రాయం క‌లుగుతోంది. 

This post was last modified on December 1, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

1 hour ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago