వచ్చే ఏడాది సంక్రాంతి కోసం చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే అదే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందని చెప్పడంతో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. పవన్ సినిమా జనవరి 12న విడుదలవుతుండగా.. ప్రభాస్ సినిమా జనవరి 14న రానుంది. అయితే ఈ సినిమాలతో పాటు నాగార్జున ‘బంగార్రాజు’ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో మాటలు వినిపిస్తున్నాయి.
నిజానికి సంక్రాంతి కోసమే ఈ సినిమాను రెడీ చేశారు. కానీ బరిలో మూడు పెద్ద సినిమాలు ఉండడంతో ‘బంగార్రాజు’ ఆలోచనలో పడ్డాడు. మొన్నామధ్య నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ కూడా మూడు సినిమాలు బరిలో ఉండగా.. నాల్గో సినిమాకు చోటు దొరకదని.. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గినా.. తమ సినిమా వచ్చేస్తుందని చెప్పింది. మరెవరైనా.. వెనక్కి తగ్గారో లేదో తెలియదు కానీ.. ‘బంగార్రాజు’ మాత్రం డేట్ లాక్ చేసుకున్నాడని టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయాలనుకుంటున్నారు. అసలైన పండగ ఫీల్ తెచ్చే సినిమా అని.. ఆ డేట్ ను లాక్ చేసుకుంటున్నారు. మరి అనుకున్నట్లుగా రిలీజ్ చేస్తారో లేక వెనకడుగు వేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతు సరసన కృతిశెట్టి కనిపించనుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
This post was last modified on November 29, 2021 10:34 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…