ఇప్పుడు రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న చాలామంది ఒకప్పుడు సినిమా పిచ్చోళ్లే. వాళ్లకు ఆరాధ్య నటీనటులుండేవాళ్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదని అంటారు. ఆయన నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అని చెబుతారు. అప్పట్లో బాలయ్య కోసం బేనర్లు కట్టేవాడని.. అభిమాన సంఘాన్ని నడిపించేవాడని కూడా ఓ ప్రచారం ఉంది. ఇదెంత వరకు నిజమన్నది తెలియదు. దీనిపై జగన్ ఎప్పుడూ స్పందించింది లేదు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే ఆ విషయం నిజమే అన్నాడు. కడప జిల్లాలో తన అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా జగన్ ఉండేవాడని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యాఖ్య చేసి ఇదేమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదన్నట్లుగా బాలయ్య మాట్లాడాడు.
ఒకప్పుడు ఎన్టీఆర్‌కు అభిమాని కాని వాళ్లు ఎవరైనా ఉండేవాళ్లా అని ప్రశ్నించాడు బాలయ్య. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ పెట్టారని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 30 శాతం మంది నాయకులు ఎన్టీఆర్‌కు వీరాభిమానులని అన్నాడు బాలయ్య.
ఒకప్పుడు ‘సమరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించిన సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ జగన్ ఇచ్చినట్లుగా ఒక యాడ్ ఆ మధ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అప్పుడు జగన్ పేరు కింద కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడనే వేశారు. ఐతే అది ఒరిజినల్ కాదని.. ఫేక్ అని.. కొందరు జగన్ అభిమానులు వాదించారు.
దానికి పేరడీగా అనేక కొత్త యాడ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ యాడ్ ఒరిజినలా కాదా అన్నది జనాలకు అర్థం కాలేదు. మరి నిజంగా జగన్ బాలయ్యకు వీరాభిమానా కాదా అన్నది ఆయన సన్నిహితులే చెప్పాలి.
This post was last modified on June 7, 2020 4:41 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…