హీరో శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరికొత్త కథలను ఎన్నుకుంటూ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక్క హిట్టు కూడా కొట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా లేదు.
ఆయన నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇవన్నీ కూడా ఫ్లాపులే. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు ఫ్లాప్ లు రావడంతో శర్వా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
శర్వానంద్ ను ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అందుకే ఈసారి ఫ్యామిలీ కథతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తన అదృష్టంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.
ఆమెకి ఉన్న క్రేజ్, లక్ కలిసొచ్చి ఈ సినిమా గనుక ఆడితే.. శర్వానంద్ కి హిట్ వస్తుంది. మరి రష్మిక లక్ శర్వాను కాపాడుతుందో లేదో చూద్దాం. ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్టు సినిమాలను తీశారాయన. మరోసారి ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నారు!
This post was last modified on November 29, 2021 5:18 pm
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…
మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…
గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…