ఆంధ్రప్రదేవ్‌లో నందమూరి బాలకృష్ణ అభిమానులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ మాటకొస్తే అందరు స్టార్ హీరోల అభిమానులదీ అదే పరిస్థితి. ఏ పెద్ద హీరో సినిమా రిలీజవుతోందన్నా.. అంతకు ముందు రోజు రాత్రి నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. తెల్లవారుజామునే బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైపోతుంది. షోకు కొన్ని గంటల ముందు నుంచే అభిమానుల సందడి మామూలుగా ఉండదు.
కొన్నిసార్లు యుఎస్ ప్రిమియర్స్ కంటే కూడా ముందు ఏపీలో బెనిఫిట్ షోల నుంచే టాక్ బయటికి వస్తుంటుంది. మంచి మాస్ సినిమా పడి.. దానికి పాజిటివ్ టాక్ వస్తే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. కానీ కరోనా టైం మొదలైన దగ్గర్నుంచి ఏపీలో ఫ్యాన్స్ షోల సందడే లేకపోయింది. 2020 సంక్రాంతి తర్వాత రిలీజైన ఏకైక భారీ చిత్రం వకీల్ సాబ్ మాత్రమే కాగా.. తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు క్యాన్సిల్ చేసేసింది ఏపీ సర్కారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ పరిస్థితి అప్పుడు చాలా ఇబ్బందికరంగా మారింది. అందరి కంటే ముందు సినిమా చూసి టాక్ చెప్పే తాము.. మిగతా అన్ని చోట్లా షోలు పూర్తయ్యాక మధ్యాహ్నానికి కానీ సినిమా పూర్తి చేయలేకపోవడం పవన్ అభిమానులను బాధించింది. ఇప్పుడు బాలయ్య అభిమానుల బాధ కూడా ఇదే. నందమూరి హీరో నుంచి కొన్నేళ్లుగా సరైన సినిమాలే రాలేదు. లేక లేక బోయపాటితో బాలయ్య సినిమా చేయడం, అఖండ మీద భారీ అంచనాలు నెలకొన‌్నాయి.
థియేటర్లలో అభిమానులు జాతర చేసుకునే అవకాశమున్న సినిమా కావడంతో దీనికి బెనిఫిట్ షోలు లేకపోవడం పట్ల వారు విలవిలలాడిపోతున్నారు. ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది ఉదయం పదికో పదిన్నరకో బాలయ్య సినిమా చూడాల్సి రావడం వారికి రుచించడం లేదు. మరీ తెల్లవారుజామున కాకపోయినా.. ఉదయం కాస్త త్వరగా షోలు వేసేలా స్థానికంగా ఎక్కడిక్కడ అనుమతులు తెచ్చుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు, అభిమాన సంఘాల వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ.. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలయ్య ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో పర్మిషన్స్ రావడం సందేహంగానే ఉంది. ఐతే గత నెలలో రజినీకాంత్ సినిమా పెద్దన్నకు ఏపీలో అక్కడక్కడా ఉదయం 6, 7 గంటలకే షోలు పడ్డాయి. అలా అఖండకు కూడా ఏమైనా అవకాశం వస్తుందేమో అని చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 29, 2021 11:18 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…