సల్మాన్ ఖాన్ సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల మోత మోగడం మామూలే. తొలి రోజు అలవోకగా పదుల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంటాయి ఆయన సినిమాలు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రేస్-3, దబంగ్-3 చిత్రాలకు కూడా ఓపెనింగ్స్ వరకు ఢోకా లేకపోయింది. కొవిడ్ వల్ల బాలీవుడ్ సినిమాలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన చివరి సినిమా ‘రాధె’ను ఓటీటీలో రిలీజ్ చేసి బయటపడిపోయారు. కానీ ఈ మధ్యే మహారాష్ట్ర సహా నార్త్ మార్కెట్లో పూర్తిగా థియేటర్లు పున:ప్రారంభమై బాగానే నడుస్తుండటంతో సల్మాన్ కొత్త చిత్రం ‘అంతిమ్’ను ఈ శుక్రవారం ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఐతే ఈ సినిమాకు ఆశించినంత మంచి టాక్ రాలేదు. రివ్యూలు మిక్స్‌డ్‌గా వచ్చాయి. అలాగని దీన్ని చెత్త సినిమా అని కూడా అనలేం. కాగా ఈ చిత్రానికి తొలి రోజు వచ్చిన వసూళ్లు షాకింగ్‌గా ఉన్నాయి.ఇండియాలో తొలి రోజు నాలుగున్నర కోట్ల లోపు గ్రాస్ రాబట్టింది ‘అంతిమ్’. సల్మాన్ కెరీర్లో గద పదేళ్లలో ఏ సినిమాకూ ఇంత తక్కువ వసూళ్లు రాలేదు. భాయ్ ఎంత చెత్త సినిమా చేసినా కనీసం రూ.15 కోట్ల గ్రాస్ గ్యారెంటీ అన్నట్లుండేది. అలాంటిది ‘అంతిమ్’కు మరీ ఇంత నామమాత్రపు వసూళ్లు రావడం చిత్ర బృందానికి జీర్ణం కావడం లేదు.
కొవిడ్‌ను సాకుగా చూపిద్దామంటే.. గత నెలలో రిలీజైన అక్షయ్ కుమార్ మూవీ ‘సూర్యవంశీ’ తొలి రోజు రూ.20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ చిత్రం ఆల్రెడీ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది కూడా. ఈ సినిమా మూడో వీకెండ్లో సాధించిన వసూళ్లను కూడా ‘అంతిమ్’ అందుకునేలా కనిపించడం లేదు. ‘అంతిమ్’ సినిమాను ప్రధానంగా తన బావమరిది ఆయుష్ శర్మను ప్రమోట్ చేయడానికి, అతడి కెరీర్‌ను నిలబెట్టడానికి చేశాడు సల్మాన్. ఇందులో ఆయనది పూర్తి స్థాయి పాత్ర కాదు. సినిమాలో లేటుగా ఎంట్రీ ఇస్తుందా క్యారెక్టర్. వసూళ్లు మరీ తక్కువగా ఉండటంతో ఇది సల్మాన్ సినిమా కాదని, ఆయన ఇందులో ఎక్స్‌టెండెడ్ క్యామియో చేశాడని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు అండగా నిలిచే పీఆర్వోలు, ట్రేడ్ పండిట్లు.
This post was last modified on November 28, 2021 2:03 pm
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజా భవన్ లో శనివారం అఖిల పక్ష…
సంగీత దర్శకుడు, హీరోగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న జివి ప్రకాష్ కుమార్ మనకు మ్యూజిక్ ద్వారానే ఎక్కువ పరిచయం.…
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. తొలిసారి ఈ వార్త బయటికి వచ్చినపుడు పవన్ అభిమానులు మాత్రమే కాదు, సగటు తెలుగు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భయం అంతకంతకూ పెరిగిపోతోందన్న వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణులు,…
ఏప్రిల్ 10 విడుదల తేదీని వద్దనుకున్నాక ది రాజా సాబ్ కొత్త డేట్ కోసం అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా సోలో హీరోగా చేసింది కేవలం 28 సినిమాలు. వాటిలో ఒక్క రీమేక్ లేదు.…