Movie News

రజనీని చెంపదెబ్బ కొట్టలేక సినిమా వదులుకున్నాడట

సూపర్ స్టార్ రజనీ సినిమాలో హీరో తర్వాత అంత కీలకమైన పాత్ర వస్తే ఎవరైనా వద్దనుకుంటారా? కానీ మలయాళ నటుడు జయరాం వద్దనేశాడట. ఐతే అతను సినిమా వదులుకుంది పాత్ర నచ్చక కాదు. ఒక సన్నివేశం నచ్చక. అందులో ఆయనకు కనిపించిన అభ్యంతరం ఏంటంటే.. రజనీకాంత్‌ను చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుందట. అలా చేస్తే రజనీ అభిమానులు తనను ఊరికే వదిలిపెట్టరని భయపడి జయరాం ఆ సినిమాను వదులుకున్నాడట.

ఆ సినిమా మరేదో కాదు.. రజనీ కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ముత్తు’. ఓ మలయాళ చిత్రం ఆధారంగా కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శరత్ బాబు పోషించిన రాజా వారి పాత్ర కోసం ముందు జయరాంనే అడిగారట. ఆయన కూడా రజనీ సినిమా అనే సరికి సంతోషంగా ఒప్పుకున్నారట.

ఐతే ఓ సన్నివేశంలో రజనీని చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుందని చెప్పారని.. ఐతే తాను ఆ పని చేయలేనని చెప్పానని.. తప్పదని అనడంతో ఆ సినిమా నుంచే తప్పుకున్నానని జయరాం చెప్పాడు. సినిమాలో అయినా సరే రజనీని చెంపదెబ్బ కొడితే అభిమానులు తట్టుకోలేరని.. వాళ్లకు భయపడే సినిమా వదులుకున్నానని జయరాం చెప్పాడు. ఈ మాటలు వింటే అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ.. తమిళనాట రజనీ అభిమానుల తీరు ఇలాగే ఉంటుంది.

‘పడయప్పా’ (నరసింహా) సినిమాలో రజనీని సవాల్ చేసే పాత్ర చేసింది రమ్యకృష్ణ. కొన్ని సన్నివేశాల్లో రజనీని అవమానిస్తుంది కూడా. ఇందుకు ఆమెపై కోపం పెంచుకుని చెన్నైలో ఒకసారి దాడికి ప్రయత్నించారు రజనీ అభిమానులు. అంతకుముందు కూడా ఇలాంటి ఉదంతాలు కొన్ని ఉన్నాయి. వాటి సంగతి తెలిసే జయరాం ‘ముత్తు’ సినిమాను వదులుకున్నట్లున్నాడు. తెలుగులో ‘భాగమతి’తో మంచి పేరు సంపాదించిన జయరాం.. ఇటీవల ‘అల వైకుంఠపురములో’లో కీలక పాత్రలో మెప్పించారు.

This post was last modified on June 7, 2020 10:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

25 mins ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

1 hour ago

నిఖిల్ క్రేజీ మూవీ ఏమైనట్టు

రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…

1 hour ago

ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది…

3 hours ago

థియేటర్ల నిస్తేజం – బాక్సాఫీసుకు నీరసం

ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…

4 hours ago

తెర‌పైకి మ‌రోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్ల‌పైనే!

రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజ‌కీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్క‌డ…

4 hours ago