సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించడం అంత తేలికైన విషయం కాదు. దీని వల్ల జరిగే మంచి కంటే ఎదురయ్యే చెడే ఎక్కువ అన్నది ఆ స్థానంలో ఉన్న వారికే తెలుస్తుంది. చేసిన ఎంతో మంచిని గుర్తించే వాళ్ల కంటే ఏదైనా ప్రతికూల విషయం జరిగితే దాన్ని పట్టుకుని రచ్చ చేసేవాళ్లే ఎక్కువ. దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణానంతరం ఖాళీ అయిన ఆ స్థానంలోకి సినీ పెద్దలెవ్వరూ రావడానికి అంతగా ఇష్టపడలేదు.
అందుక్కారణం.. ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి పరిష్కరించడానికి బాధ్యత తీసుకోవాలి. సాయం కోరే ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలి. అవసరం లేని పంచాయితీల్లో తలదూర్చాలి. అందుకే చాలామంది సీనియర్లు దీనికి దూరంగా ఉండిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ స్థానంలోకి రావడానికి ఇష్టం లేకపోయినా కొందరి బలవంతం మేరకో, ఇండస్ట్రీకి సాయం చేయాలన్న తలంపుతోనో బాధ్యత తీసుకున్నారు. ఇదేమీ అధికారిక హోదా కాకపోయినా చిరంజీవి ఎంత బాధ్యతతో వ్యవహరించాడో కొన్నేళ్ల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా టైంలో ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కొన్ని వేదికల మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్న సంస్కారం ఆయనది. సినీ పరిశ్రమలోని వ్యక్తులకు కష్టాలు వస్తే చేతికి ఎముక లేనట్లు సాయం అందజేస్తున్న చిరు.. తాజాగా శివశంకర్ మాస్టర్ కొవిడ్ వల్ల విషమ స్థితికి చేరుకున్నారని తెలిసి ఆయన కొడుకుని పిలిపించి రూ.3 లక్షల సాయం అందజేశారు. ఐతే చిరు అనధికారిక సినీ పెద్దగా ఇంత బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ఈ స్థానం ఖాళీగా ఉందని, అందులోకి మోహన్ బాబు రావాలని ‘మా’ ఎన్నికల టైంలో నరేష్ వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఓపెన్‌గా మాట్లాడాలంటే ఇప్పుడు శివశంకర్ మాస్టర్ కష్టంలో ఉంటే చిరు కాకుండా ఎవరైనా ఇండస్ట్రీలో స్పందించి ఇలా సాయం అందించారా అన్నది చూడాలి. అసలు ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణ వల్ల తీరని నష్టం జరుగుతున్నా, ఇండస్ట్రీనే సంక్షోభంలో పడే పరిస్థితి ఉన్నా ఇండస్ట్రీలో ఎవ్వరూ నోరు మెదపట్లేదు. చిరు మాత్రమే ఈ విషయంలోనూ స్పందించారు. రేట్లు మార్చాలని కోరారు. హోదాను అనుభవించడం వేరు.. ఇలా అవసరమైతే సాయానికి ముందుకు రావడం, ఇండస్ట్రీ కోసం మాట్లాడ్డం వేరు. ఈ విషయంలో చిరుకు, మిగతా వాళ్లకు ఏమైనా పోలిక ఉందా?
This post was last modified on November 27, 2021 6:19 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…