కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్ సూపర్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారంటే ఔరా అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన తెలుగు స్టార్ హీరోలే దాదాపు 50 కోట్ల మేర పారితోషకాలు పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల రేంజ్ దానికి డబుల్ అయింది. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు వంద కోట్ల రెమ్యూనరేన్ క్లబ్‌లో ఉన్నారు. వీరిలో కొందరు లాభాల్లో వాటా కింద వంద కోట్లకు మించి కూడా ఒక్కో సినిమాకు ఆదాయం పొందుతున్న దాఖలాలున్నాయి. వీళ్లందరి నెక్స్ట్ టార్గెట్ రూ.150 కోట్లే.
ఐతే ఈ మార్కును బాలీవుడ్ స్టార్లు కాకుండా ఒక తెలుగు హీరో అందుకోబోతున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ హీరో ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన సినిమాల బడ్జెట్లు, పారితోషకాల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు.
ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయ సినిమాకు గాను ప్రభాస్ రూ.150 కోట్లతో రికార్డు పారితోషకం అందుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రభాస్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న టీ సిరీస్ సంస్థ.. ఈమేర రికార్డు రెమ్యూనరేషన్ ఆఫర్‌తో అతడిని సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా ప్రభాస్ రెడీ అయ్యాడట.
ఈ సినిమాను ఈ మధ్యే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పట్టాలెక్కడానికి ఇంకో రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఆలోపు రాధేశ్యామ్ సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలు రిలీజై ఉంటాయి. ప్రాజెక్ట్ కే కూడా పూర్తి కావస్తుంది. కాబట్టి ప్రభాస్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశముంది. మార్కెట్ లెక్కలు కూడా మారుతుంటాయి కాబట్టి ఈ చిత్రానికి ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడంటే మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
This post was last modified on November 24, 2021 9:45 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…