మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరపురాని చిత్రాల్లో విజేత ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఒకప్పటి అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి కలయికలో చిరంజీవి ఈ సినిమా చేశాడు. అదిపోయే డ్యాన్సులు, ఫైట్లతో అలరిస్తూ.. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యే యాక్షన్ ప్రధాన సినిమాలతో సాగిపోతున్న టైంలో.. చిరు కొంచెం రూటు మార్చి ఒక ఉదాత్త కథాంశంతో తెరకెక్కిన విజేత చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
కుటుంబం కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి, తోడబుట్టిన మిగతా వాళ్లంతా బాధ్యత మరిస్తే, తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ మీద ఆశ చంపుకుని కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో చెల్లెలి పెళ్లి చేసే కుర్రాడి పాత్రను పోషించాడు చిరు ఈ చిత్రంలో. తాను ఒక విభిన్నమైన, గొప్ప ప్రయత్నం చేశానని.. దీన్ని ఆదరించాలని చిరు కోరే దృశ్యం కూడా ఉంటుంది టైటిల్స్‌లో. కమర్షియల్‌గా ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నప్పటికీ చిరు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదొకటి.
ఇప్పుడు విజేత గురించి ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఈ క్లాసిక్‌కు చిరు ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడట. చిరు ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టులో దీన్ని కూడా చూపిస్తున్నారు. యన్.టి.ఆర్, 83, తలైవి లాంటి సినిమాలను నిర్మించిన విష్ణువర్ధన్ ఇందూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడట. సైమా అవార్డులను నిర్వహించే విష్ణుకు చిరుతో మంచి అనుబంధమే ఉంది. తనకో సినిమా చేయాలని చిరు అడగ్గా.. ఆయన అంగీకరించారని, చిరు సినిమాల్లో తనకెంతో నచ్చిన విజేత మూవీకి సీక్వెల్ తీయాలని విష్ణు భావిస్తున్నారని.. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదని.. కథ, దర్శకుడు రెడీ అయ్యాక చిరుతో ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని..
ఈ ప్రాజెక్టుకు చిరు కమిట్మెంట్ అయితే ఇచ్చారని అంటున్నారు. మరి 36 ఏళ్ల ముందు వచ్చిన ఈ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ఎలాంటి కథ రెడీ చేసి సినిమా తీస్తారో చూడాలి.
This post was last modified on November 24, 2021 9:41 am
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…