ఒకప్పుడు పవర్‌ఫుల్ రోల్స్‌తో రఫ్పాడించిన రాజశేఖర్.. మధ్యలో కొన్నాళ్లపాటు సరైన సక్సెస్‌లు రాక స్ట్రగులయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత ‘గరుడవేగ’ మూవీ చేసి ఓ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘కల్కి’గా వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా ఆయన స్పీడుకి బ్రేకులైతే వేయలేదు. ఆ హుషారులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి కమిటైన ఆయన.. ఆమధ్య తన పుట్టినరోజుకి మూడు సినిమాలని అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. వాటిలో ‘శేఖర్’ ఒకటి.
లలిత్ దర్శకత్వంలో ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. నెరిసిన గడ్డం, మీసాలు, ముఖంపై గాటుతో చాలా డెప్త్ ఉన్న లుక్‌లో కనిపించాడు రాజశేఖర్. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 25న ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు యాంగ్రీ స్టార్.
2018లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’కి రీమేక్ ఇది. జోజు జార్జ్ నటిస్తూ నిర్మించాడు. బెన్యామీన్ రాసిన ‘శరీరశాస్త్రం’ అనే నవల థీమ్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు ఎం.పద్మకుమార్. మంచి క్రైమ్ థ్రిల్లర్. ఆర్గన్ ట్రేడ్ చుట్టూ తిరుగుతుంది. రిటైర్డ్ పోలీసాఫీరుగా అద్భుతంగా నటించినందుకు కేరళ స్టేట్ అవార్డుతో పాటు నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు జోజు జార్జ్.
అంత గొప్ప సినిమాకి రీమేక్ కావడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. లుక్ చూశాక రాజశేఖర్ కూడా జోజు చేసిన పాత్రకి పర్‌ఫెక్ట్ అనిపిస్తున్నారు. లలిత్ ఎలా తీస్తున్నాడనేదాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కి ఓ సాలిడ్ హిట్ అయితే అవసరం. అది ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాలి.
This post was last modified on November 22, 2021 8:43 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…