లాక్ డౌన్ కి సంబంధించి మెగా ఫాన్స్ కి ఉన్న ఆనందం ఏమైనా వుంటే అది చిరంజీవి సోషల్ మీడియాలో అడుగు పెట్టడం. ఏదో పేరుకి ట్విట్టర్ లోకి రావడం కాకుండా చిరంజీవి అప్పట్నుంచీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి విషయంపై తగు స్పందనతో పాటు తన హాస్య చతురత కూడా పలుమార్లు చూపించారు. అలాగే ఇండస్ట్రీలో ప్రముఖుల పుట్టినరోజున వారి గురించి ప్రత్యేక ట్వీట్స్ వేస్తూ అలరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ 10న బాలయ్య పుట్టినరోజున చిరు ఏమి ట్వీట్ చేస్తారనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల బాలకృష్ణ చేసిన విమర్శల నేపథ్యంలో చిరు వేసే పుట్టినరోజు ట్వీట్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. మరి చిరంజీవి ఆ రోజు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తారా లేక మనసు నొప్పించిన నేస్తం పట్ల కినుక వహిస్తారా? చిరంజీవి తత్త్వం తెలిసిన వారయితే ఆయన కచ్చితంగా ట్వీట్ వేస్తారనే భావిస్తున్నారు.
This post was last modified on June 7, 2020 7:52 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…