షూటింగ్స్ చేసుకోమని ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కొందరు ఆ ప్రయత్నాలలో బిజీ అయితే కొన్ని సినిమాలకు పరిస్థితులలో షూటింగ్ మొదలు పెట్టే అవకాశమే లేదు. అందులో గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ ఒకటి. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. తనతో గౌతమ్ నంద చిత్రం తీసిన సంపత్ నంది డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రానికి సంబంధించి కబడ్డీ సీన్స్ మినహా మిగతా షూటింగ్ చేసేసారు. ఇప్పుడు ఆ కబడ్డీ సీన్స్ వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ సమక్షంలో చేయాల్సి ఉంది. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూసే వారిని గ్రీన్ మ్యాట్ వేసి మేనేజ్ చేద్దామని, షూటింగ్ జులైలో మొదలు పెట్టేద్దామని సంపత్ చెప్పాడట. అయితే అందుకు గోపీచంద్ అంగీకరించలేదట.
కబడ్డీ సీన్స్ అంటే ముట్టుకోకుండా చేయడం కష్టం కాబట్టి డిసెంబర్ కి పరిస్థితి సాధారణ స్థాయికి వస్తే అప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రిస్క్ వద్దని చెప్పాడట. హీరోకి ఇష్టం లేకుండా దర్శకుడు ఈలా వేస్తే ఉపయోగం ఏముంటుంది. అందుకే ప్రస్తుతానికి సీటిమార్ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడిపోయినట్టే.
This post was last modified on June 7, 2020 10:23 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…