తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని నాలుగు నెలలు కావస్తోంది. అయినా సరే.. అప్పుడప్పుడూ ఓ సినిమా ఓటీటీలో రిలీజవుతూనే ఉంది. ఈ వారాంతంలో కూడా ‘అద్భుతం’ అనే చిత్రం హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే వారం విక్టరీ వెంకటేష్ చిత్రం ‘దృశ్యం-3’ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబరు 25న విడుదలవుతుంది. దీనికి తోడు వచ్చేవారం ఇంకో సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అదే.. బ్రో. నవీన్ చంద్ర, అవికా గోర్ కీలక పాత్రలు పోషించిన ‘బ్రో’ను సోనీ లివ్ రిలీజ్ చేస్తోంది.
ఈ మధ్యే తెలుగు మార్కెట్ మీద కన్నేసిన సోనీ లివ్.. వివాహ భోజనంబు, ఆకాశవాణి చిత్రాలను నేరుగా తమ ఓటీటీలో విడుదల చేసింది. ఇప్పుడు ‘బ్రో’ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఇంప్రెసివ్‌గానే అనిపిస్తోంది.
ట్రైలర్ చూస్తే అన్నాచెల్లెళ్ల మధ్య సాగే క్యూట్ స్టోరీలా కనిపిస్తోంది ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే కథ అనగానే ఎన్నో సెంటిమెంట్ సినిమాలు కళ్ల ముందు కదలాడతాయి. కానీ ‘బ్రో’ వాటికి భిన్నమైన సినిమాలా కనిపిస్తోంది.
అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే గిల్లిగజ్జాలు, స్వీట్ మూమెంట్స్ మధ్య నడిచే సినిమాలా ఉందిది. చిన్నపుడు చెల్లెలితో చాలా సరదాగా గడిపిన అన్న.. తర్వాత చదువు, ఉద్యోగం కోసమని దూరంగా వెళ్లిపోయి.. చాలా ఏళ్లకు తిరిగి రావడం.. వచ్చాక చెల్లెలు చేసే పనులకు ఉక్కిరి బిక్కిరి కావడం.. ముందు ఆమె చర్యలకు కోపం వచ్చినా తర్వాత తనకు చేరువ కావడం.. ఈ నేపథ్యంలో కథ నడిచి.. చివరగా హృద్యమైన సన్నివేశాలతో ముగిసేలా కనిపిస్తోంది. ట్రైలర్ వరకు చూస్తే ‘బ్రో’లో ఒక క్లాసిక్ టచ్ కనిపించింది. సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి మరి. కార్తీక్ తురుపాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేజేఆర్ రవిచంద్ నిర్మించాడు.
This post was last modified on November 20, 2021 10:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…