జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డును అనుకొని ఉండే కేబీఆర్ పార్కులో ఆదివారం రాత్రి అనూహ్య సంఘటన జరగటం తెలిసిందే. నటి సాలూ చౌరాసియా వాకింగ్ చేస్తున్న వేళ.. ఆమె మొబైల్ ఫోన్ దొంగలించే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా ఆమెపైన దాడికి పాల్పడటం.. పెద్ద రాయితో ఆమెను గాయపరిచే యత్నాన్ని త్రుటిలో తప్పించుకోవటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ దాడి కమ్ చోరీ నేరంలో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన వేళ.. చోరీ దొంగను పట్టుకోవటం చాలా సులువైంది.
కాకుంటే.. కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ఉన్న 60కు పైగా సీసీ కెమేరాలు పని చేయకపోవటంతో పోలీసులకు చిక్కుగా మారింది. దీంతో.. భారీ ఎత్తున డేటాను వడబోయటంతో పాటు.. పోలీస్ టెక్నిక్ లను ఉపయోగించి.. ఎట్టకేలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడెవరన్న వివరాలతో పాటు.. అతడిపై గతంలో నమోదైన కేసుల గురించి ఆరాతీశారు. శనివారం మధ్యాహ్నం నిందితుడ్ని మీడియా ముందుకు తీసుకొచ్చిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వివరాల్ని వెల్లడించారు.
నిందితుడుమహబూబ్ నగర్ జిల్లా కు కుల్కచర్ల చెందిన కొమ్ము బాబు గా గుర్తించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన అతను.. సినిమా షూటింగ్ లలో సెట్ వర్కర్ గా పని చేస్తుండేవాడు. ప్రస్తుతం నగరంలోని ఇందిరానగర్ లో ఉండే ఇతడు.. సినిమా షూటింగ్ లలో పని అవకాశాలు తగ్గటంతో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించేందుకు చోరీలకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఇందుకు కేబీఆర్ పార్కు ఔటర్ ట్రాక్ ను అడ్డాగా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో షాలూ చౌరాసియాపై దాడి చేసి ఆమె మొబైల్ అపహరించుకెళ్లాడు. ఆమెపై దాడి చేసి.. ఫోన్ చోరీ చేసేందుకు అతను పక్కాగా రెక్కీ నిర్వహించాడు.
ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా ఆమె చీకటి ప్రదేశానికి వచ్చిన వెంటనే ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ఆమె నోరు అరవకుండా మూసేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె బలంగా ప్రతిఘటిస్తున్నవేళ.. ఆమె తలను బండరాయితో కొట్టే ప్రయత్నం చేసినా.. ఆమె తప్పించుకోవటంతో బతికిపోయింది. ఆమెపై దాడి చేసి ఐఫోన్ దొంగలించాడు. అతడి ప్రైవేట్ పార్ట్ మీద కొట్టిన ఆమె అతడి చెర నుంచి తప్పించుకుంది. నిందితుడు సైతం చోరీ తర్వాత పారిపోయాడు. సీసీ కెమేరాలు పని చేయకపోవటంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకోవటం ఆలస్యమైంది. అయితే.. బంజారాహిల్స్ పోలీసులకు టాస్కు ఫోర్సు పోలీసులు జతకావటంతో ఈ కేసును త్వరగా కొలిక్కి తీసుకు రావటానికి అవకాశం ఏర్పడింది.
నిందితుడ్ని గుర్తించేందుకు గతంలో ఇలాంటి చోరీలు చేసే వారి డేటా తెప్పించి.. అందులో 80 మందిని అనుమానితుల కింద తేల్చి.. ఒక్కొక్కరిగా విచారించిన తర్వాత నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. గతంలోనే ఇలాంటి నేరాలు చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు.
This post was last modified on November 20, 2021 10:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…