సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు జులై నెలాఖర్లోనే తెరుచుకున్నప్పటికీ.. సెప్టెంబర్లో ‘లవ్ స్టోరి’ వచ్చే వరకు అంతగా సందడి కనిపించలేదు. ఆ సినిమాకు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం.. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడటంతో తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఆ ఊపు తర్వాత దసరా టైంలోనూ కొనసాగింది.
టాలీవుడ్ పూర్వపు ఫాంలోకి వచ్చేసిందని అంతా సంబరపడ్డారు. కానీ ఈ స్ట్రీక్‌ను కొనసాగించడంలో తర్వాతి చిత్రాలు విఫలమయ్యాయి. అందులోనూ నవంబరు ఆరంభం నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. దీపావళికి వచ్చిన మూడు సినిమాలూ తుస్సుమనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత వారం వచ్చిన రెండు చిత్రాల్లో ‘పుష్పక విమానం’కు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. ‘రాజా విక్రమార్క’ అయితే వాషౌట్ అయిపోయింది.
గత వీకెండ్ తర్వాత థియేటర్లు వెలవెలబోతున్నాయి. మినిమం ఆక్యుపెన్సీ లేదు. థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా వసూళ్లు కూడా రావడం లేదు. బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా, సరైన సినిమా కోసం బాక్సాఫీస్ ఎదురు చూస్తున్నా ఈ వారం పేరున్న సినిమాలను ఎవ్వరూ థియేటర్లలోకి దించట్లేదు. డిసెంబరులో డేట్ల కోసం కొట్టేసుకుంటున్నారు కానీ.. నవంబరును వదిలేశారు.
ఊరూ పేరు లేని సినిమాలేవో కొన్ని ఈ వారం రిలీజవుతున్నాయి. కాస్త పేరున్న సినిమాలనే ప్రేక్షకులు పట్టించుకోవట్లేదంటే ఈ చిత్రాల కోసం థియేటర్లకు వెళ్తారనుకుంటే భ్రమే. వచ్చే వారం కూడా ‘అనుభవించు రాజా’ తప్ప నోటెడ్ రిలీజ్ ఏదీ లేదు. రాజ్ తరుణ్ వరుస ఫెయిల్యూర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా ఏమేర బాక్సాఫీస్ దగ్గర సందడి తెస్తుందన్నది సందేహమే. డిసెంబరు 2న ‘అఖండ’ వచ్చే వరకు బాక్సాఫీస్‌కు కష్టాలు తప్పేలా లేవు.
This post was last modified on November 18, 2021 10:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…