మెగా ఫ్యామిలీని అదే పనిగా టార్గెట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై మూడేళ్ల కిందట ‘ఖైదీ నంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగబాబు ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. అలాంటి నాగబాబు.. రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడానికి ఒక ఐడియా ఇచ్చాడిప్పుడు. నాగబాబు చుట్టూ ముసురుకున్న ఓ వివాదమే వర్మ స్టోరీకి ఐడియా కావడం విశేషం. ఇంతకీ వర్మ సినిమా తీయబోయేది ఎవరి మీద అంటారా.. నాథూరాం గాడ్సే.
గాంధీని హతమార్చిన గాడ్సే మీద ఇటీవల నాగబాబు ఇటీవల పాజిటివ్ ట్వీట్లు వేయడం తెలిసిన సంగతే. గాంధీని చంపడం నేరమే అయినా.. గాడ్సే దేశభక్తిని శంకించలేమంటూ వ్యాఖ్యానించాడు నాగబాబు. ఆయన వాదనలో నిజం ఉన్నప్పటికీ జనాల్లోకి ఈ ట్వీట్లు వేరే రకంగా వెళ్లాయి. గాంధీని చంపిన హంతకుడిని దేశభక్తుడు అనడమేంటంటూ ఆయనపై చాలామంది విరుచుకుపడ్డారు.
ఐతే నాగబాబు వ్యాఖ్యలకు మద్దతుగా.. గాడ్సే గురించి విభిన్న కోణాలతో పోస్టులు పెట్టిన వాళ్లూ ఉన్నారు. ఈ సమాచారమంతా వర్మ చదివాడో ఏమో.. గాడ్సే మీద సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో గాడ్సే మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు వర్మ. తాను గాడ్సేకు మద్దతుగా.. గాంధీని కించపరిచేలా సినిమా తీయబోనని.. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగానే గాడ్సే సినిమా స్క్రిప్టు తయారు చేస్తున్నానని వర్మ తెలిపాడు.
ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు వస్తాయనేమీ అనుకోవడం లేదని వర్మ అన్నాడు. వర్మ ఇలా ఆ సమయానికి చిన్నా పెద్ద అని తేడా లేకుండా చర్చల్లో ఉన్న ఏదో ఒక అంశాన్ని పట్టుకుని సినిమా అనౌన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇలా ఆయన అనౌన్స్ చేసిన సినిమాలన్నీ పట్టాలెక్కలేదు కూడా. మరి గాడ్సే మీద తీస్తానన్న సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on June 6, 2020 9:08 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…