స్క్విడ్ గేమ్.. స్క్విడ్ గేమ్.. కొన్ని నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న మాట ఇది. ఈ పేరుతో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచింది. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. అపూర్వమైన ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సిరీస్ సాధించిన ఓ సంచలన రికార్డు గురించి తెలిసి అంతా ఔరా అంటున్నారు.
ఇప్పటిదాకా వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే అత్యధిక సమయం ప్రేక్షకులు వీక్షించిన సిరీస్‌గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. ఆ సమయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సిరీస్‌ను చూసిన సమయం ఏకంగా 1.65 బిలియన్ గంటలట. అంటే మన కాలమానంలోకి మారిస్తే అది ఒక లక్షా 82 వేల సంవత్సరాల సమయమట.
ఈ గణాంకాల్ని బట్టి స్క్విడ్ గేమ్ ఏ స్థాయిలో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం కూడా లేదు. థ్రిల్లర్ జానర్లో టాప్ క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొరియన్ ఫిలిం మేకర్స్ పెట్టింది పేరు. అక్కడి ఫిలిం మేకర్ హువాంగ్ డాంగ్ హ్యుక్ నెట్ ఫ్లిక్స్ కోసమే ఈ సిరీస్‌ను క్రియేట్ చేశాడు. ఇదొక సర్వైవల్ డ్రామా నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్. స్క్విడ్ గేమ్‌కు సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అంటున్నారు.
కాగా ఇటీవలే భారీ అంచనాలతో నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన మరో సిరీస్ రెడ్ నోటీస్‌కు కూడా అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటిదాకా ఆ సిరీస్‌ను 148.7 మిలియన్ గంటల పాటు వీక్షించారట ప్రేక్షకులు. మరో పాపులర్ సిరీస్ మెక్సికో మూడో సీజన్‌కు కూడా నెట్ ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా గణాంకాల్ని బట్టి అర్థమవుతోంది.
This post was last modified on November 18, 2021 9:07 am
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…