సరిగ్గా పదేళ్ల కిందట.. వై దిస్ కొలవరి అంటూ ఒక పాట ఎంతటి సంచలనం రేపిందో గుర్తుండే ఉంటుంది. గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ విప్లవం కారణంగా ఇప్పుడు ప్రతి పాటకూ మిలియన్లకు మిలియన్లు వ్యూస్ వచ్చేస్తున్నాయి కానీ.. కొన్ని లక్షల వ్యూస్ వచ్చినా కూడా గొప్పగా చూసే టైంలో కోట్లల్లో వ్యూస్ కొట్టి సంచలనం రేపిన పాట ‘వై దిస్ కొలవరి’. బేసిగ్గా ఇది తమిళ పాట అయినా.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ స్థాయిలో కూడా ‘కొలవరి’ రేపిన ప్రకంపనల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కేవలం 17 ఏళ్ల వయసులో అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేసి.. సంగీత ప్రపంచంలోకి సంచలన అరంగేట్రం చేశాడు. ఈ పాట గాలివాటం అనుకున్న వాళ్లకు ‘3’ సినిమాలోనే మరిన్ని మంచి పాటలతో దీటైన సమాధానం చెప్పాడు. ఇక ‘3’ తర్వాత అతను ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన తీరు కూడా ఆశ్చర్యం కలిగించేదే.
తమిళంలో విజయ్, అజిత్, రజినీకాంత్.. ఇలా పెద్ద పెద్ద స్టార్లు చాలామందితో పని చేసిన అతను.. సంగీత పరంగా ఏ సినిమాతోనూ నిరాశ పరచలేదు. అదిరిపోయే పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆ సినిమా నిరాశ పరిచినా.. ఆ తర్వాత ‘జెర్సీ’తో తనేంటో రుజువు చేశాడు. పదేళ్ల సంగీత ప్రయాణం పూర్తయిన నేపథ్యంలో అనిరుధ్ తన ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
30 ఏళ్ల వయసులోపు సంగీత దర్శకుడిని కావాలని తాను లక్ష్యంగా పెట్టుకుంటే పదేళ్ల ముందే తన కల నెరవేరిందని.. ఒక్క పాటతో రాత్రికి రాత్రి తన జీవితం మారిపోయిందని.. ఆ తర్వాత తన కెరీర్ అత్యద్భుతంగా సాగిందని అనిరుధ్ పేర్కొన్నాడు. తెలుగులో చేసిన మూడు చిత్రాలు సహా ఇప్పటిదాకా తాను చేసిన సినిమాలన్నింటి గురించీ వీడియోలో ప్రస్తావించిన అనిరుధ్.. ఇంతటితో అయిపోలేదని.. ఇంకా చాలా ఉందని పేర్కొన్నాడు. ఈ వీడియో అనిరుధ్ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తోంది.
This post was last modified on November 17, 2021 2:07 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…