2022 సంక్రాంతి సినిమాల విషయంలో విపరీతమైన చర్చ నడుస్తోంది కొన్ని రోజులుగా. అనుకోకుండా పండుగ రేసులోకి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం ఎందుకని మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను వేసవికి వాయిదా వేసేశారు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ కూడా నడుస్తుందని అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు. రాజమౌళి టీం నుంచి విన్నపం వెళ్లినా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు తగ్గలేదని తెలుస్తోంది.
సంక్రాంతి కాదంటే మళ్లీ వేసవి వరకు ఎదురు చూడాలని.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాను అంత కాలం ఆపలేమని.. వేరే రోజుల్లో రిలీజ్ చేస్తే ఆశించిన వసూళ్లు రావని.. అందుకే సంక్రాంతికే తమ చిత్రాన్ని విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టే తాము తగ్గేది లేదంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’లో చాలామంది స్టేక్స్ ఉన్నాయి. దిల్ రాజు సహా టాలీవుడ్లో టాప్ డిస్ట్రిబ్యూటర్లు వివిధ ఏరియాలకు ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ రేసులో ఉంటే కచ్చితంగా థియేటర్ల సమస్య ఎదురవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన ఐదు రోజులకే థియేటర్లలో బాగా కోత తప్పదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు రికవరీ కష్టమవుతుంది. ‘రాధేశ్యామ్’ వచ్చాక ఎలాగూ థియేటర్లు తగ్గించాల్సిందే కానీ.. అంతకు రెండు రోజుల ముందే మరిన్ని థియేటర్లు పవన్ సినిమాకు కూడా ఇవ్వాలంటే కష్టమే.
అన్నింటికీ మించి ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అలాంటి చిత్రానికి అడ్డంకులు రాకుండా చూసుకోవాలన్న అభిప్రాయం ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందంతో రాజు అండ్ కో చర్చలు జరుపుతున్నారట. ఎలాగైనా సినిమాను వాయిదా వేయించాలని.. తర్వాత ఎప్పుడు వచ్చినా సినిమాకు పూర్తి సహకారం ఉంటుందని, కావాల్సినన్ని థియేటర్లు దక్కేలా చూస్తామని.. ఇండస్ట్రీ మంచి కోసం వాయిదాకు ఒప్పుకోవాలని రాజు బృందం సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on November 17, 2021 1:36 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…