మూడు నెలలుగా సినీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పనులు మొదలుపెట్టకపోతే అంతే సంగతులు. థియేటర్లలో సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడించే పరిస్థితి లేకపోయినా.. కనీసం షూటింగ్స్ విషయంలో అయినా సడలింపులు వస్తే అదే చాలనుకుంటోంది పరిశ్రమ.
ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు చర్చలు కూడా జరిపారు. ఇక షూటింగ్స్ పున:ప్రారంభించడం లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. ఐతే షూటింగ్ స్పాట్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలపై ఒక నోట్ తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తుండగా.. ఇండస్ట్రీ నుంచి కూడా గైడ్ లైన్స్ కోరింది. ఈ బాధ్యతను సినీ పెద్దలు సీనియర్ దర్శకుడు తేజకు అప్పగించారు.
కరోనా ముప్పు లేకుండా షూటింగ్స్ ఎలా నిర్వహించాలో ఇండస్ట్రీ తరఫున తేజనే కొన్ని గైడ్ లైన్స్ తయారు చేశాడు. వాటిని ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. ఐతే సినిమాలు తీసేటపుడు షూటింగ్ టైంలో స్ట్రిక్టుగా ఉంటాడని పేరున్న తేజ.. ఈ మార్గదర్శకాల విషయంలోనూ మరీ స్ట్రిక్టుగా వ్యవహరించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ స్పాట్లో నటీనటులు తప్ప అందరూ పీపీఈ కిట్లు ధరించాలని తేజ సూచించాడట. ఇది అంత సులువైన విషయం కాదు.
ఇక షూటింగ్స్‌లో బఫే భోజనం లాంటివి వద్దని.. ఎవరి భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలన్న సూచన కూడా చేశారు. జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు చాలామంది సెట్లో భోజనం పెడితే కడుపు నిండుతుందని వస్తారు. వాళ్లంతా భోజనాలు తెచ్చుకోవాలంటే ఇబ్బందే. షూటింగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకితే చికిత్స ఖర్చులు నిర్మాతే భరించాలన్న సూచన అనివార్యమైందే. 60 ఏళ్లకు పైబడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు షూటింగ్ స్పాట్లో ఉండకూడదన్న నిబంధన అమలు అంత సులువు కాదు.
మొత్తంగా చూస్తే తేజ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాడని.. ప్రభుత్వం ఇవే షరతులు పెడితే వాటిని అనుసరించి షూటింగ్స్ చేయడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
This post was last modified on June 6, 2020 2:36 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…