20 ఏళ్ల కెరీర్లో అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ఆయనకు విజయాలేమీ ఊరికే వచ్చేయలేదు. ఒకప్పుడు మామూలు సినిమాలే తీసినా.. ఆ తర్వాత మగధీర, ఈగ, బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు తీయడానికి రాజమౌళి ఎంతెంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు.
ఐతే బాలీవుడ్లో ఇలా పెద్దగా కష్టపడకుండానే వందల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు అందించే దర్శకుడొకడున్నాడు. అతనే రోహిత్ శెట్టి. అతనే కళాఖండాలు తీయడు. మామూలు మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. కానీ మాస్ పల్స్ బాగా తెలిసిన అతడికి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇంతకముందు వచ్చిన సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అవుతాడు. లేదంటే వేరే భాష నుంచి సినిమా తీసుకుని రీమేక్ చేస్తాడు. ఎలా చేసినా.. మాస్‌ను అలరించడం మాత్రం బాగా తెలుసు.
ఇలాగే ఇప్పటిదాకా 8 వంద కోట్ల సినిమాలు అందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు అతడి నుంచి తొమ్మిదో వంద కోట్ల సినిమా వచ్చింది. అదే సూర్యవంశీ. కరోనా దెబ్బకు విలవిలలాడిపోయిన బాలీవుడ్‌కు ఊపిరి పోసిన చిత్రమిది. కేవలం వంద కోట్లతో ఆగిపోకుండా.. వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసిందీ సినిమా. ఫుల్ రన్లో రూ.250 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది.
సూర్యవంశీకి మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఇది కూడా రోహిత్ మార్కు రొటీన్ మాస్ మసాలా సినిమానే. కానీ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్‌కు లోటు లేదు. దీనికంటే ముందు రోహిత్.. టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. సింబా పేరుతో వచ్చిన ఆ సినిమా ప్రోమోలు చూసి టెంపర్‌ను చెడగొట్టేశారనే అభిప్రాయం కలిగింది. కానీ ఆ సినిమా కూడా రూ.200 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం.
This post was last modified on November 16, 2021 10:54 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…