Movie News

సంక్రాంతి వార్.. పవన్ చేసింది తప్పా?


మొత్తానికి 2022 సంక్రాంతికి తెలుగు చిత్రాల సమరంపై క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మాత్రమే ఇప్పటిదాకా ఖరారవగా.. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ కూడా బెర్తు ఖరారు చేసుకుంది. ఈ సినిమా ముందు నుంచే సంక్రాంతి రేసులో ఉంది కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో అది వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పటికే మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని వేసవికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

ఇగోకు పోయి ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం కంటే ఇలా వాయిదా వేసుకోవడమే కరెక్ట్ అనే అభిప్రాయాలు కలుగుతుండటంతో పవన్ సినిమాను కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పించవచ్చని అనుకున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ టీం తగ్గలేదు. ముందు చెప్పినట్లే జనవరి 12నే తమ సినిమా వస్తుందని స్పష్టం చేసింది.

‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ మూవీ ‘గంగూబాయి కతియావాడీ’ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి వాయిదాకు ఒప్పించగలిగిన రాజమౌళి.. ‘భీమ్లా నాయక్’ టీంకు మాత్రం కన్విన్స్ చేయలేకపోయాడు. ఆయన ఈ చిత్ర బృందానికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదని తెలుస్తోంది. దీంతో ‘భీమ్లా నాయక్’ టీంను, పవన్ కళ్యాణ్‌ను ఒక వర్గం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా టాలీవుడ్‌కు గర్వకారణమని.. అలాంటి సినిమాకు స్పేస్ ఇవ్వకుండా ఇలా పోటీకి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆల్రెడీ సంక్రాంతి బెర్తులు బుక్ అయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ టీం లేటుగా రేసులోకి రావడం సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.

‘ఆర్ఆర్ఆర్’ అప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దసరాకు తమ చిత్రం పక్కాగా వస్తుందని క్లారిటీ ఇచ్చాకే వేరే చిత్రాలు సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. ఆ మేరకు షూటింగ్ సహా అన్ని ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా పని చేసుకుంటుంటే ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. వేసవి లాంటి సీజన్లో అయితే వేరే చిత్రాలను కొన్ని వారాలు వాయిదా వేసుకోవచ్చు. కానీ సంక్రాంతి కాదంటే మళ్లీ మంచి సీజన్ కోసం వేసవి వరకు ఎదురు చూడాలి. అందుకే ‘భీమ్లా నాయక్’ టీం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అయినా ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం వల్ల ‘భీమ్లా నాయక్’కే రిస్క్ కాబట్టి ఆ చిత్రాన్ని సంక్రాంతికే ఖరారు చేయడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.

This post was last modified on November 16, 2021 10:45 pm

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

44 minutes ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

1 hour ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

3 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

5 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

9 hours ago