హైదరాబాద్ మహానగరంలో వీఐపీలు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు వాకింగ్ చేసే ప్రాంతం కేబీఆర్ పార్కు. ప్రధాన రోడ్డు పక్కనే ఉండే ఈ పార్కుకు వాకింగ్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేయటానికి వచ్చిన నటిపై దాడి జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఆదివారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం దాడికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలైన నటి చౌరాసియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చూస్తే.. ఆదివారం సాయంత్రం చౌరాసియా కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న ఐఫోన్ ను లాక్కెళ్లాడు.
తన ఫోన్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడితో నటి చౌరాసియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపై దాడి చేయటమే కాకుండా.. రాయికి ఆమెను బలంగా కొట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. దుండగుడి కారణంగా గాయాలు కావటంతో ఆమె కింద పడిపోయారు. ఫోన్ ను దొంగలించిన అతను పారిపోయాడు.
అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. దాడిలో గాయపడిన నటిని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు గాయాలు అయినట్లు చెబుతున్నా.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చే పార్కు వద్ద ఈ ఘటన జరగటం సంచలనంగా మారింది.
This post was last modified on November 15, 2021 10:48 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…