మోడర్న్ క్యారెక్టర్లు చేసే స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలుగా చూపించాలంటే అంత తేలిక కాదు. ఈ మధ్యే వచ్చిన కొండపొలంలో గొర్రెలు మేపుకునే అమ్మాయిగా రకుల్ ప్రీత్‌ను చూపించడానికి క్రిష్ అండ్ టీం చాలానే కష్టపడింది. మేకప్ విషయంలో ఎంత శ్రమించారో వీడియో రూపంలో కూడా రిలీజ్ చేశారు.
రంగు తక్కువున్న వాళ్లకు రెగ్యులర్ మేకప్ వేసి తెల్లగా చేయడం కంటే.. మంచి రంగున్న వాళ్లను ఛామన ఛాయకు మార్చాలంటే తేలికేమీ కాదు. రకుల్ తర్వాత రష్మిక మందన్నా సైతం మేకప్ కోసం చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది పక్కా పల్లెటూరి పాత్ర. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోల్లో రష్మిక ఒరిజినల్ కంటే తక్కువ రంగులో, ఛామన ఛాయలో కనిపిస్తోంది.
ఇందుకోసం మేకప్ ద్వారా బాగానే మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని రష్మిక పరోక్షంగా ఒక ఫొటో ద్వారా రివీల్ చేసింది. ఆమె తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫొటో పెట్టింది. అందులో ఒక చేయి కనిపిస్తుండగా.. మణికట్టు వరకు నల్లగా ఉన్న ఆ చేయి.. పైభాగంలో తెల్లగా ఉంది. ఈ పొటో పెట్టి పుష్ప లంచ్ బ్రేక్స్ ఇలా ఉంటాయి అంటూ ఫన్నీ ఇమోజీ జోడించింది రష్మిక.
అంటే ఆమె ఒంటి మొత్తానికి నలుపు రంగు పూసేశారని.. తిండి తినడం కోసం చేతిని కడుక్కుంటే అది మాత్రం ఒరిజినల్ రంగులోకి వచ్చిందని పరోక్షంగా రష్మిక చెబుతున్నట్లుంది. సాలిడ్ కలర్లో ఉండే రష్మికను ఛామన ఛాయలో చూపించడానికి పుష్ప టీం ఎంత శ్రమిస్తోందో చెప్పడానికి ఈ ఫొటోనే రుజువు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 17న పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 15, 2021 7:40 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…