ఇంకో ఐదు రోజుల్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. అందుకు ఐదు రోజుల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. స్టార్ హీరోల పుట్టిన రోజులొస్తుంటే.. ముందే స్పెషల్‌గా కామన్ డిస్ ప్లే పిక్ రెడీ చేయించి.. సెలబ్రెటీలతో దాన్ని లాంచ్ చేయించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది.
ఇదే కోవలో బాలయ్య అభిమానుల కోసం ఓ సీడీపీ తయారు చేయించారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలు లుక్‌తో పాటు నిప్పురవ్వలో లుక్ తీసుకని జై బాలయ్య నినాదాలు, బాలయ్య తల్లిదండ్రుల ఫొటోలతో కలిపి ఈ సీడీపీ తయారు చేయించారు. ఈ సీడీపీని ఏకంగా 50 మంది ప్రముఖులతో లాంచ్ చేయించడం విశేషం. అందులో బాలయ్య తనయురాలు బ్రాహ్మణితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పీఆర్వోలు ఉన్నారు.
గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 25 మంది సెలబ్రెటీలతో సీడీపీ లాంచ్ చేయించారు. బాలయ్య విషయానికి వచ్చేసరికి సంఖ్య రెట్టింపవడం విశేషం. ఇటీవల చిరు అండ్ కోతో బాలయ్య అనుకోని తగవు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయంలో సినీ పరిశ్రమ రెండుగా చీలినట్లు కనిపించింది.
కానీ ఇప్పుడు చిరు వర్గం అనుకున్న చాలామంది బాలయ్య గురించి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ ఆయన బర్త్ డే సీడీపీతో ట్వీట్లు వేయడం విశేషం. ఆ ట్వీట్లు.. అవి వేసిన వ్యక్తుల్ని చూస్తే వీళ్లు బాలయ్యను ఈ రేంజిలో లేపుతున్నారేంటి అన్న అనుమానం కలుగుతుంది.
చిరు, బాలయ్య మధ్య అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి ఇండస్ట్రీ అంతా ఒకటే అని చూపించేందుకే ఈ ప్రయత్నమా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే బాలయ్య పుట్టిన రోజుకు ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on June 6, 2020 7:18 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…