అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ విడుదలకు అటు ఇటుగా నెల రోజుల సమయమే మిగిలుంది. ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోయినప్పటికీ.. ఇంకో వారం పది రోజుల్లో ఆ పనంతా అవగొట్టి అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేయగలమన్న ధీమాతో ఉంది సుకుమార్ టీం.
ఒకవేళ మరీ మించిపోతే సినిమాను వారం రోజులు వాయిదా వేసి.. డిసెంబరు 24న రావాల్సిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని వారం ముందుకు జరిపేలా సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్ సీజన్లో ‘పుష్ప’ సందడి చేయడం మాత్రం పక్కా అని అర్థమవుతోంది. ఐతే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు :హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మిగతా దక్షిణాది భాషల విషయంలో అనుమానాలేమీ లేవు కానీ.. హిందీ రిలీజ్ విషయంలోనే ఈ మధ్య సందేహాలు తలెత్తాయి. ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులు తీసుకున్న సంస్థ థియేట్రికల్ రిలీజ్ విషయంలో వెనుకంజ వేస్తోందని.. రిలీజ్ ఖర్చులు భరించడానికి సిద్ధంగా లేదని.. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఇబ్బందులున్నాయని వార్తలొచ్చాయి. ‘పుష్ప’కు హిందీ థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చనే గుసగుసలు వినిపించాయి. దీంతో బన్నీ నార్త్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరిగింది.
‘నా పేరు సూర్య’ లాంటి ఫ్లాప్ మూవీని డబ్బింగ్ చేసి చాలా గ్యాప్ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ‘పుష్ప’కున్న క్రేజ్ దృష్ట్యా దీన్ని నార్త్ ఇండియాలో థియేటర్లలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించాలని పట్టుదలతో ఉన్న బన్నీ ‘పుష్ఫ’ హిందీ రిలీజ్ విషయంలో అస్సలు తగ్గట్లేదని.. తమ గీతా ఆర్ట్స్ నెట్ వర్క్‌ను రంగంలోకి దించి ఈ సినిమాను యధావిధిగా నార్త్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశాడని.. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయినట్లే అని సమాచారం. కాబట్టి ఈ సినిమా 17న హిందీలో కూడా సందడి చేయడం పక్కా అన్నట్లే.
This post was last modified on November 14, 2021 3:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…