Movie News

భీమ్లానాయక్.. ఎటూ తేల్చడేంటి?


2022 సంక్రాంతి సినిమాల విషయంలో ఇప్పటిదాకా స్పష్టత కనిపించడం లేదు. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’.. 14న ‘రాధేశ్యామ్’ ఖరారైనట్లే కానీ.. మధ్యలో 12కు షెడ్యూల్ అయిన ‘భీమ్లా నాయక్ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో ఆల్రెడీ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను వేసవికి వాయిదా వేసేశారు. ‘భీమ్లా నాయక్’ కూడా వాయిదా పడటం లాంఛనమే అనుకున్నారు. కానీ ఆ చిత్ర బృందం ఆ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. పైగా ఇంతకుముందు లాగే ప్రమోషన్ల జోరు కొనసాగిస్తోంది. కొత్తగా ఏ ప్రోమో రిలీజ్ చేసినా జనవరి 12న విడుదల అనే నొక్కి వక్కాణిస్తోంది.

‘సర్కారు వారి పాట’ టీం కూడా ఒక దశలో ఇలాగే గాంభీర్యం ప్రదర్శించినా.. తర్వాత వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ టీం కూడా అలాగే చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఎంతకీ విషయం మాత్రం తెగట్లేదు.

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’లతో పాటుగా ‘భీమ్లా నాయక్’ కూడా వస్తే కచ్చితంగా థియేటర్ల సమస్య తప్పదు. దీనికి తోడు వసూళ్లపైనా ప్రభావం ఉంటుంది. మూడు చిత్రాల్లో ఏది వీక్ అయితే దానికి వసూళ్లలో కోత పడుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్, దాని మీద ఉన్న అంచనాల దృష్ట్యా మిగతా రెండు చిత్రాలకే కష్టం అనే అభిప్రాయం ఉంది. ఎంతైనా ‘భీమ్లా నాయక్’ రీమేక్ మూవీ, పైగా మామూలు చిత్రం కాబట్టి దానికి ఇబ్బందే అంటున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం పవన్ కళ్యాణ్ మేనియాను నమ్ముకుంది.

తమ సినిమా పాటలు, ఇతర ప్రోమోలకు వస్తున్న అద్భుత స్పందనతో సంక్రాంతి విడుదల విషయంలో తగ్గొద్దనుకుంటోంది. డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. థియేటర్లు బుక్ చేసుకోవాలని సంకేతాలు కూడా అందినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. సంక్రాంతికి ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తోంది. ఒకవేళ పక్కాగా సంక్రాంతికి వచ్చేట్లయితే ‘భీమ్లా నాయక్’ టీం అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించి సస్పెన్సుకు తెరదించేస్తే బెటరేమో.

This post was last modified on November 14, 2021 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago