సుకుమార్ సినిమాలంటే ఎప్పుడూ ఒక భారీతనం ఉంటుంది. ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడే రకం ఐతే ఎంత ఖర్చు చేసినా.. సినిమాను సరిగ్గా మార్కెట్ చేసి.. క్రేజ్ పెంచి నిర్మాతలకు మంచి బిజినెస్ అయ్యేలాగా చూస్తాడన్న పేరు ఆయనకు ఉంది.
తన చివరి సినిమా రంగస్థలంకు కూడా సుకుమార్ బడ్జెట్ హద్దులు దాటించేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో.. ఏ స్థాయిలో బిజినెస్ జరిగిందో.. రిలీజ్ తర్వాత అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఐతే ఇలా బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల 1 నేనొక్కడినే లాంటి సినిమాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ ఎలాంటిదన్నది కూడా తెలిసిందే. ఐతే ఇప్పుడు తన కొత్త చిత్రం పుష్ప విషయంలోనూ సుకుమార్ ఓ రేంజిలో ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు కొంచెం ఎక్కువే అయిందట.
పుష్ప సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే.. సుదీర్ఘంగా సాగిన స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్ పనుల కోసం దాదాపు రూ.10 కోట్ల దాకా ఖర్చు పెట్టించినట్లుగా గుసగుసలు వినిపించాయి అప్పట్లో. ఇక కరోనా అడ్డంకులు.. మధ్య మధ్యలో షూటింగ్‌కు బ్రేకులు పడటం.. షెడ్యూళ్లు వాయిదా పడటం.. లాంటి కారణాలతో కూడా బడ్జెట్ ఎక్కువైంది.
ఇక మేకింగ్ విషయంలోనూ ఖర్చు మామూలుగా లేదట. కేవలం పాటలకే రూ.10 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడట సుక్కు. వేర్వేరు లొకేషన్లలో భారీగా జనాలతో.. భారీ సెట్ ప్రాపర్టీస్‌తో.. ఎక్కువ రోజులు తీసిన దాక్కో దాక్కో మేక పాటకే రూ.3 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం.
తాజాగా సామి సామి పాటను పూర్తి చేయగా.. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. ఇక చివరగా ఐటెం సాంగ్ తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. దానికి 2-3 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారని.. అది సినిమాలో అన్నింటికంటే గ్రాండ్‌గా ఉండే సాంగ్ అని అంటున్నారు. మొత్తంగా సినిమాలో ఉన్న ఐదు పాటలకు కలిపి రూ.10 కోట్ల దాకా ఖర్చవుతోందట. అంటే ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా తీసే ఖర్చుతో సుకుమార్ పాటలే తీశాడన్నమాట.
This post was last modified on %s = human-readable time difference 11:39 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…