‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది కాకుండా మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదొక ఐటెం సాంగ్. అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షురూ చేసేశారు. ఇప్పుడు ఐటెం సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుందట. పూజాహెగ్డే, తమన్నాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా ఐటెం సాంగ్ లో కనిపించింది. కానీ ప్రస్తుతం ఆమెకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ‘పుష్ప’కి డేట్స్ ఇస్తుందా..? అంటే సందేహమే. మరి సుకుమార్ ఎవరిని ఫైనల్ చేసుకున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. ‘పుష్ప’ కోసం కూడా ఐటెం సాంగ్ ను భారీగా ప్లాన్ చేశారట. నవంబర్ మూడో వారంలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. దాంతో షూటింగ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. వీలైనంత త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసి చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.
This post was last modified on November 14, 2021 8:15 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…