‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు కదా.. మళ్లీ ‘గాడ్ ఫాదర్’కి బాలయ్యకి లింక్ ఏంటి అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే.. 1972లో హాలీవుడ్ లో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా వచ్చింది. అదొక కల్ట్ క్లాసిక్. ఆ సినిమాకి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది.
అలాంటి సినిమాను బాలయ్య చేస్తే చూడాలని ఉందని చెప్పారు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం బాలయ్య ‘ఆహా’ కోసం ‘Unstoppable’ అనే షో చేస్తున్నారు. ఈ షో సెకండ్ ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా వచ్చారు.
ఈ సందర్భంగా బాలయ్యతో కలిసి ముచ్చట్లు పెట్టారు నాని. పలు ఆసక్తికర విషయాల గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి సినిమా చేస్తే.. ఆ సినిమా ఎలా ఉండాలనే విషయాన్ని బయటపెట్టాడు నాని.
‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమా తెలుగులో వస్తే.. అందులో బ్రాండోగా బాలయ్య నటిస్తే.. తను అల్-పాచినో పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు. నాని.. బాలయ్యకు పెద్ద ఫ్యాన్. తను నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాలో కూడా బాలయ్య అభిమానిగా కనిపించారు నాని.
తన అభిమాన హీరోతో మల్టీస్టారర్ చేయాలని.. దానికోసం ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమా స్క్రిప్ట్ కావాలంటూ చెప్పేశాడు నాని. మరి ఆ రేంజ్ లో ఉండే కథను మన దర్శకులెవరైనా.. సిద్ధం చేస్తే.. ఈ కాంబినేషన్ ను తెరపై చూడడం పెద్ద కష్టం కాదేమో. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
This post was last modified on November 13, 2021 2:13 pm
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…