అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ కచ్చితంగా ఆ తేదీకి సినిమా వస్తుందా రాదా అన్న సందేహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే విడుదలకు అటు ఇటుగా నెల రోజులే సమయం ఉండగా.. ఇంకా ఆ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. ఇంకా కనీసం వారం రోజులు షూటింగ్ కొనసాగుతుందని అంటున్నారు.
ఇక మిగిలిన మూణ్నాలుగు వారాల్లో వివిధ భాషల్లో డబ్బింగ్, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం రిలీజ్ చేయగలరా.. అనుకున్న మేర ప్రమోషన్లు చేయగలరా అన్నది సందేహంగా మారింది.
ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో ఎక్కువ రోజులు సినిమాను వాయిదా వేసే అవకాశం లేదు. ఇంకోసారి డేట్ మారిస్తే ప్రేక్షకుల నుంచి కూడా ప్రతికూల స్పందన ఉంటుంది. అలాగని డెడ్ లైన్ అందుకోగలమా లేదా అనే భయం సుక్కు అండ్ టీంను వెంటాడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్న సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం పుష్ప చిత్రాన్ని వారం రోజులు ఆలస్యంగా, క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ సే అవకాశాలున్నాయంటున్నారు.
డిసెంబరు 24వ తేదీని ఈ సినిమా కోసం తీసుకుని.. ఆ రోజు రావాల్సిన నాని సినిమా శ్యామ్ సింగరాయ్‌ను వారం ముందుకు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారట. మరి కొన్ని రోజుల్లో పుష్ప ప్రోగ్రెస్ చూసుకుని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని.. చాలా వరకు ఈ ఎక్స్‌చేంజ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
This post was last modified on November 12, 2021 10:17 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…