బంగార్రాజు సినిమా రెండు మూడు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లింది. సంక్రాంతి రేసులోకి చాలా లేటుగా వచ్చిన సినిమా అది. అయితేనేం చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ప్రమోషన్ల హడావుడి కూడా మొదలుపెట్టేసింది. ఈ సినిమా నుంచి తొలి పాట లడ్డుండాను ఇటీవలే విడుదల చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది.
సినిమా మొదలైన దగ్గర్నుంచి, విడుదలకు మధ్యలో చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే, ఇంకోవైపు ప్రమోషన్ల గురించి పక్కాగా ప్లాన్ చేసుకుంది బంగార్రాజు బృందం. ఇక సంక్రాంతికి వస్తుందో తెలియదో కానీ.. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సైతం పాటలతో సందడి చేస్తూనే ఉంది. ప్రమోషన్ల పరంగా లోటు రాకుండా చూసుకుంటోంది. ఇక ఆర్ఆర్ఆర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రమోషన్ల పరంగా హోరెత్తిస్తోంది.
కానీ సంక్రాంతికి వీటన్నిటికంటే ముందు బెర్తు బుక్ చేసుకున్న రాధేశ్యామ్ మాత్రం ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడి ఉంది. సినిమా మొదలై రెండేళ్లు కావస్తుండగా.. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి ఒక్కటంటే ఒక్క పాట రిలీజ్ చేయలేదు. ఇంతకుముందైతే షూటింగ్ అవ్వలేదు. రిలీజ్ డేట్ దూరంగా ఉందని ఆగారేమో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విడుదలకు రెండు నెలలే సమయం ఉండగా.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన సినిమా నుంచి ఒక్కటంటే ఒక్క పాట రిలీజ్ కాలేదు. ఇంకే రకమైన ప్రమోషన్లు కూడా లేవు.
గత నెల ప్రభాస్ పుట్టిన రోజుకు చిన్న వీడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. అది మాస్‌కు అసలేమాత్రం ఎక్కలేదు. అసలే ప్రమోషన్ల పరంగా ముందు నుంచి వెనుకబడి ఉండగా.. రిలీజ్ దగ్గర పడే సమయానికి కూడా చిత్ర బృందంలో కదలిక లేకపోవడం ఆశ్చర్యం. యువి క్రియేషన్స్ అంటేనే ప్రమోషన్లు, అప్‌డేట్స్ ఉండవంటూ ప్రభాస్ అభిమానులు మండిపడటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది వారి తీరు చూస్తే.
This post was last modified on November 12, 2021 7:10 am
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…