ఆంధ్రప్రదేశ్‌లో సినిమా బిజినెస్ మామూలుగానే కరోనా దెబ్బకు బాగా దెబ్బ తినేసింది. అది చాలదన్నట్లు టికెట్ల రేట్లపై అక్కడ నియంత్రణ తీసుకురావడంతో సినిమాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ‘ఎ’ సెంటర్ల వరకు టికెట్ల రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయి కానీ.. బి, సి సెంటర్లలో దశాబ్దం కిందటున్న నామమాత్రపు రేట్లతో టికెట్లు అమ్మాలనడమే ఎవరికీ మింగుడు పడటం లేదు.
ఈ సెంటర్లలో కామన్ రేటు రూ.100 చొప్పున టికెట్ అమ్మేలా చూడాలని సినీ పరిశ్రమ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇదిగో అదిగో అంటూనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ వేడుకలో ఈ విషయమై ఎంత గట్టిగా మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీని వల్ల మరింత ఇగోకు వెళ్లినట్లుంది ఏపీ సర్కారు. ఐతే టికెట్ల రేట్లపై నియంత్రణ వల్ల ఇన్ని రోజులూ నిర్మాతలకు నేరుగా సెగ తగల్లేదు. కానీ ఇప్పుడు కథ మారింది.
టాలీవుడ్లో పెద్ద సినిమాలకు సంబంధించి ఒకప్పుడు చేసుకున్న బిజినెస్ డీల్స్ రివైజ్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలల్లో రిలీజైన ప్రతి సినిమాకూ ఏపీలో అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లే వచ్చాయి. తెలంగాణలో మంచి లాభాలందుకున్న ‘లవ్ స్టోరి’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి చిత్రాలకు కూడా ఏపీలో నష్టాలు తప్పలేదు.
ఈ నేపథ్యంలో ముందు అనుకున్న ఒప్పందాల కంటే 20 శాతం తక్కువగా డబ్బులు కడతామని, లేకుంటే తమకు వర్కవుట్ కాదని ఏపీలో బయ్యర్లు కచ్చితంగా చెబుతున్నారు. దీనికి నిర్మాతలు ససేమిరా అంటున్నారు. ముందు అనుకున్న రేట్లకు సినిమాను కొని తెలిసి తెలిసి తామెలా నష్టపోతామంటున్నారు బయ్యర్లు. నిర్మాతలేమీ అలా తగ్గిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఇక వాళ్లకున్న ఏకైక మార్గం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు పారితోషకాల్లో కోత విధించడమే.
ముఖ్యంగా సినిమాకు సంబంధించి మేజర్ పారితోషకం వెళ్లేది హీరోలకే. వాళ్లు కొంచెం తగ్గించుకుని డబ్బులు వెనక్కి ఇచ్చినా, పుచ్చుకోబోయే దాంట్లో కోత పెట్టుకున్నా సమస్య కొంచెం పరిష్కారం అవుతుంది. కానీ హీరోలను అలా అడిగే ధైర్యం నిర్మాతలకు ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు బయ్యర్లతో డీల్ చేయలేక, అటు హీరోలకు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారు నిర్మాతలు. ఏపీలో టికెట్ల రేట్ల గొడవ పరిష్కారం అయ్యే వరకు ఈ తలనొప్పి తప్పదు.
This post was last modified on November 12, 2021 1:48 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…