సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల నిరీక్షణకు ఎంతకీ తెరపడట్లేదు. ఆయన్నుంచి ఒక సంతృప్తికర సినిమా రావాలని, అది బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించాలని వాళ్లు ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. కానీ ‘రోబో’ తర్వాత అలాంటి సినిమా ఒక్కటీ రాలేదు. కొన్ని సినిమాలకు టాక్ బాగుంటే వసూళ్లు బాగా లేవు. కొన్నింటికి ఓపెనింగ్స్ బాగుంటే టాక్ బాగా లేక ఆ తర్వాత సినిమా నిలబడట్లేదు. ఇలా గత పదేళ్లలో వచ్చిన రజినీ సినిమాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి.
చాలా సినిమాల విషయంలో రజినీది ఆరంభ శూరత్వమే అవుతోంది. తొలి రోజు లేదంటే వీకెండ్ వరకు కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. రజినీ పవర్ తగ్గలేదనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోతోంది. సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘అన్నాత్తె’ విషయంలోనూ ఇదే జరిగింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకు చాలా బ్యాడ్ టాక్ రావడం తెలిసిందే.
ఐతే టాక్‌తో సంబంధం లేకుండా తమిళనాట ‘అన్నాత్తె’ మంచి వసూళ్లే రాబట్టింది. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరగడంతో ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోయింది. రెండు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసినట్లుగా ప్రచారం ఊదరగొట్టేశారు. ఐతే వీకెండ్ వరకు ఎలాగోలా లాక్కొచ్చిన ఈ సినిమా సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పతనం చవిచూసింది. బుకింగ్స్, కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
సోమవారం నుంచి వసూళ్లు నామమాత్రమే. ‘కాలా’ తర్వాత రజినీ కెరీర్లో అత్యధిక నష్దాలు తెచ్చిపెట్టనున్న సినిమాగా ‘అన్నాత్తె’ నిలవబోతోందని అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇక తెలుగులో ‘పెద్దన్న’గా రిలీజైన ఈ సినిమాను మొదట్నుంచే మనవాళ్లు పట్టించుకోలేదు. ఓపెనింగ్స్ దగ్గరే చతికిలపడ్డ ‘పెద్దన్న’ ఆ తర్వాత అస్సలు కోలుకోలేపోయింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.12 కోట్లు కాగా.. ఇప్పటిదాకా రూ.5 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. తెలుగులో ఇదొక పెద్ద డిజాస్టర్ అన్నది ఖరారైపోయింది.
This post was last modified on November 10, 2021 5:51 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…