ఒక ఐడియా పుట్టాక దాన్ని ఒక కథగా మలిచి.. పకడ్బందీ స్క్రిప్టు రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? కొందరు వారాల్లోనే ఈ పని పూర్తి చేస్తారు. కొందరు నెలలు టైం తీసుకుంటారు. ఇంకొందరికి మాత్రం సంవత్సరాలు పడుతుంది. ఐతే ఏళ్లకు ఏళ్లు స్క్రిప్టు రెడీ చేశారంటే అదొక మెగా ప్రాజెక్టు అయి ఉంటుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మామూలు సినిమాలకు కూడా స్క్రిప్టు విషయంలో చాలా టైం పట్టేస్తుంటుంది.
‘బంగార్రాజు’ విషయంలో ఇలాగే జరిగింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్ర తాలూకు బ్యాక్ స్టోరీతో ఈ సినిమా తీయాలని నాలుగైదేళ్ల కిందటే నిర్ణయం జరిగింది. కానీ ఈ చిత్రానికి స్క్రిప్టు మాత్రం ఒక పట్టాన తేలలేదు. సీనియర్ రచయిత సత్యానంద్‌తో కలిసి దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల ఏకంగా నాలుగేళ్ల పాటు ఈ స్క్రిప్టు మీద పని చేశాడు.
ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఈ ఏడాది మధ్యలో ఆ స్క్రిప్టుకు నాగార్జున ఆమోద ముద్ర వేసి షూట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండు నెలల కిందటే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడం తెలిసిందే. సినిమా ఎప్పుడు తీసినా సంక్రాంతి రిలీజ్ అని ముందే ఫిక్సయిపోయిన నాగ్.. 2022 సంక్రాంతికి భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ తమ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆ సీజన్లోనే రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ దిశగా శరవేగంగా పని జరిగిపోతోంది. స్క్రిప్టు కోసం నాలుగేళ్లు వెచ్చించిన కళ్యాణ్.. నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేసేస్తున్నాడు.
స్క్రిప్టు పక్కాగా రెడీ కావడం, స్టోరీ బోర్డ్, పకడ్బందీ షెడ్యూల్స్ వేసుకుని షూటింగ్ చేస్తుండటంతో ఎక్కడా ఆలస్యం కావట్లేదు. ఇప్పటికే సగానికి పైగా సినిమా పూర్తయిపోయింది. కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం మైసూర్‌కు బయల్దేరింది తాజాగా. ఓవైపు షూటింగ్ కానిస్తూనే.. ఇంకోవైపు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. సినిమా నుంచి తొలి పాట.. ‘లడ్డుండ’ను తాజాగా రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. డిసెంబరు మధ్యకల్లా షూట్ పూర్తి చేసి తర్వాతి నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు పూర్తి చేసి సినిమాను సంక్రాంతి రేసులో నిలపడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 9, 2021 7:58 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…