బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో ఇప్పటికీ మాట్లాడుతుండడంతో పూనమ్ అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన సామ్ బాంబే.. పూనమ్ ను గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆమె తన భర్త సామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పూనమ్ దాదాపు రెండేళ్లపాటు సామ్ బాంబేతో సహజీవనం చేసి గతేడాది సెప్టెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే తన భర్త చేయి చేసుకోవడంతో అతడిపై డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది. ఆ సమయంలో సామ్ బాంబే తనను క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే.. పూనమ్ పై దాడి చేశాడు.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది పూనమ్. తన భర్త సామ్ ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ, ఆ తరువాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపరిచాడని.. సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడని వాపోయింది. దీనివలన ఎన్నిరోజు హాస్పిటల్ లో ఉండాల్సివస్తుందే తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
This post was last modified on November 9, 2021 12:06 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…